Asianet News TeluguAsianet News Telugu

ఎన్ కౌంటర్లో పాల్గొన్న తొలి మహిళా ఎస్ఐ ప్రియాంక..

దేశంలోనే మొట్టమొదటిసారి ఓ మహిళా ఎస్ఐ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న రికార్డ్ సాధించింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. 2008సం.లో ఢిల్లీ పోలీస్ క్రైం బ్రాంచ్ లో ఎస్ఐగా చేరిన ప్రియాంక తాజాగా ప్రగతి మైదాన్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో పాల్గొన్నారు. దీంతో ఎన్ కౌంటర్ లో పాల్గొన్న మొదటి మహిళా ఎస్ఐగా పేరు పొందారని ఢిల్లీ అడిషనల్ పోలీస్ కమీషనర్ శిబేష్ సింగ్ తెలిపారు.

SI Becomes First Woman Cop To Be Part Of Encounter : Delhi Police - bsb
Author
Hyderabad, First Published Mar 27, 2021, 10:48 AM IST

దేశంలోనే మొట్టమొదటిసారి ఓ మహిళా ఎస్ఐ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న రికార్డ్ సాధించింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. 2008సం.లో ఢిల్లీ పోలీస్ క్రైం బ్రాంచ్ లో ఎస్ఐగా చేరిన ప్రియాంక తాజాగా ప్రగతి మైదాన్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో పాల్గొన్నారు. దీంతో ఎన్ కౌంటర్ లో పాల్గొన్న మొదటి మహిళా ఎస్ఐగా పేరు పొందారని ఢిల్లీ అడిషనల్ పోలీస్ కమీషనర్ శిబేష్ సింగ్ తెలిపారు. 

ఈ ఎన్ కౌంటర్ తర్వాత గ్యాంగ్ స్టర్ రోహిత్ చౌదరి, అతని సహచరుడు పర్వీన్ అలియాస్ టిటును మహిళా ఎస్ఐ ప్రియాంక అరెస్ట్ చేశారు. ఈ ఎన్‌కౌంటరులో రోహిత్ చౌదరి, పర్వీన్ ల కాళ్లకు గాయాలవడంతో వారిని ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించామని ప్రియాంక తెలిపారు. 

ఈ ఎన్ కౌంటర్ లో గ్యాంగ్ స్టర్లు ప్రియాంక మీద కాల్పులు జరపగా, అవి ఆమె బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కు తగిలాయి. కాగా ఎన్ కౌంటర్ లో పాల్గొన్న మహిళా ఎస్ఐ ప్రియాంకను ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. మహిళా ఎస్ఐ ప్రియాంకను అరెస్ట్ చేసిన గ్యాంగ్ స్టర్ల పేరిట రూ. 5 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios