Asianet News TeluguAsianet News Telugu

'అఫ్తాబ్.. నన్ను చంపి.. ముక్కలు ముక్కలు చేసి పడేస్తాడు..' రెండేళ్ల క్రితమే శ్రద్ధా ఫిర్యాదు 

రెండేళ్ల క్రితమే అఫ్తాబ్ పై శ్రద్ధా మహారాష్ట్రలోని పాల్ఘర్‌లోని తులిన్జ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అందులో ఆఫ్తాబ్ పూనావాలా తనని కొట్టాడని, చంపేస్తానని బెదిరించాడని పేర్కొంది. ఆ తర్వాత ఎలాంటి వివాదం లేదని లిఖితపూర్వకంగా ఇచ్చింది. దీంతో పోలీసులు కేసు కొట్టేశారు. 

Shraddha Walkar murder  Earlier case closed in 2020 after she withdrew complaint against Aaftab Poonawala
Author
First Published Nov 23, 2022, 8:34 PM IST

దేశరాజధాని ఢిల్లీలో అత్యంత దారుణంగా హత్యకు గురైన  శ్రద్ధా కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. తాజాగా ఈ కేసులో పోలీసులకు కీలకమైన ఆధారం లభించింది. రెండేళ్ల క్రితమే శ్రద్ధను హత్య చేయాలని ఆఫ్తాబ్ భావించినట్లు తెలుస్తుంది. అంతేకాదు.. శ్రద్ధను గొంతు కోసి.. ముక్కలు విసిరేస్తానని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన శ్రద్దా.. అఫ్తాబ్‌పై ముంబైలోని తులిన్జ్ పోలీస్ స్టేషన్‌లో  ఫిర్యాదు చేసింది. అఫ్తాబ్ తనను గొంతు కోసి చంపడానికి ప్రయత్నించాడని, నరికి విసిరేస్తానని బెదిరించాడనీ, అఫ్తాబ్ నన్ను చంపేశాడని అఫ్తాబ్ కుటుంబానికి తెలుసునని, నన్ను చంపాలనుకుంటున్నాడని అతను తన ఫిర్యాదులో పేర్కొంది. కానీ..  తర్వాత ఎలాంటి వివాదం లేదని లిఖితపూర్వకంగా ఇచ్చింది. 

ఫిర్యాదులో శ్రద్ధ ఏం రాసింది?

నవంబర్ 23, 2020న శ్రద్ధా వాకర్ మహారాష్ట్రలోని పాల్ఘర్‌లోని తులిన్జ్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. తాను అఫ్తాబ్ పూనావాలా(25)పై ఫిర్యాదు చేయాలనుకుంటున్నానని శ్రద్ధా వాకర్ .. లిఖితపూర్వక ఫిర్యాదులో రాసింది. తాము ఇద్దరం.. అఫ్తాబ్ విజయ్ విహార్ కాంప్లెక్స్‌లోని రీగల్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాం. ప్రతి రోజూ.. అఫ్తాబ్ పూనావాలా దుర్భాషలాడుతూ తనపై విచక్షణారహితంగా దాడి చేస్తున్నాడు. నిర్దాక్షిణ్యంగా చంపేస్తాననీ.. నేడు అఫ్తాబ్ నన్ను చంపడానికి ప్రయత్నించాడు. గొంతుకోసి చంపేందుకు ప్రయత్నించాడు. నన్ను బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేసి ముక్కలు ముక్కలు చేస్తానన్నాడు. ఆరు నెలలుగా అఫ్తాబ్ నన్ను కొడుతున్నాడు. అయితే అఫ్తాబ్ ను ఎదిరించి పోలీసులకు వచ్చి ఫిర్యాదు చేసే ధైర్యం నాకు లేదు. అఫ్తాబ్ నన్ను  చంపడానికి ప్రయత్నించాడని అఫ్తాబ్ తల్లిదండ్రులకు తెలుసు. మేము లివ్-ఇన్ రిలేషన్షిప్‌లో ఉన్నామని వారికి తెలుసు. మేము పెళ్లి చేసుకోబోతున్నాం. మా పెళ్లికి  అఫ్తాబ్ కుటుంబీకులు అంగీకరించారు. అందుకే మేము సహజీవనం చేస్తున్నాం. కానీ..ఈరోజు జరిగిన ఘటన తరువాత నాకు అఫ్తాబ్‌తో కలిసి జీవించడం ఇష్టం లేదు. నాకు ఎలాంటి హాని జరిగిన అతడే బాధ్యుడు. నేను ఎక్కడైనా కనిపిస్తే చంపేస్తానని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నాకు ఏమైనా  జరిగితే.. అది అఫ్తాబ్ వల్లే జరిగిందని భావించాలి అని ఫిర్యాదు లో పేర్కోంది.  

శ్రద్దా  ఫిర్యాదుపై విచారణ జరిపినట్లు పోలీసులు తెలిపారు. కానీ..వారం రోజుల తరువాత శ్రద్ధ ఫిర్యాదును ఉపసంహరించుకుందని, తమ మధ్య ప్రస్తుతం ఎలాంటి సమస్యలేవని పేర్కొంది.దీంతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఈ విషయంపై మీరా భయందర్-వసాయి విరార్ (MBVV) కమిషనరేట్ డీసీపీ సుహాస్ బావాచే మాట్లాడుతూ..2020లో శ్రద్ధా వాకర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా తాము దర్యాప్తు ప్రారంభించామని, అయితే కేసును ఉపసంహరించుకోవాలని ఆమె వ్రాతపూర్వక ప్రకటన ఇవ్వడంతో కేసును మూసివేసినట్లు తెలిపారు. "తనకు , ఆఫ్తాబ్ పూనావాలాకు మధ్య వివాదం పరిష్కరించబడింది" అని శ్రద్దా  స్వయంగా లిఖితపూర్వకంగా వాంగ్మూలం ఇచ్చారు. ఆ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలిపిందని అన్నారు. వివాదాన్ని పరిష్కరించడానికి వారి తల్లిదండ్రులు వచ్చారని తెలిపిందని, ఈ మేరకు వ్రాతపూర్వక స్టేట్‌మెంట్ ఇవ్వడంతో ఆ కేసును మూసివేయబడిందని బావ్చే తెలిపారు. 

కోపంతో హత్య

మరోవైపు కోర్టు ముందు అఫ్తాబ్ నేరం అంగీకరించాడు. ఏం చేసినా పొరపాటున చేశానని.. కోపంతో శ్రద్ధను చంపేశానని తెలిపాడు. పోలీసుల విచారణలో వారికి పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిపాడు. శ్రద్ధా మృతదేహం ముక్కలు ఎక్కడ పడేశానో  పోలీసులకు అన్నీ చెప్పాను. హత్య ఘటన జరిగి.. చాలా రోజులు కావడంతో మర్చిపోయాను. పొరపాటున ఏం జరిగినా ఆ కోపంతోనే హత్య చేశారు. అయితే.. ఇప్పుడు శ్రద్ధా పోలీస్ కంప్లైంట్ తెరపైకి రావడంతో అఫ్తాబ్ చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నాడని తేలిపోయింది.

నాలుగు రోజుల పాటు రిమాండ్ 

ఢిల్లీ పోలీసుల డిమాండ్‌తో కోర్టు అఫ్తాబ్ రిమాండ్‌ను నాలుగు రోజులు పొడిగించింది. అఫ్తాబ్ మృతదేహాన్ని ముక్కలను విసిరిన అడవుల్లో పోలీసులు ఇప్పుడు మరోసారి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించనున్నారు. అఫ్తాబ్ దర్యాప్తును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నడనీ.. ఎప్పటికప్పుడు తన ప్రకటనలు మారుస్తూనే ఉన్నాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. శ్రద్ధా మృతదేహం ముక్కలు, ఆయుధాలు, శ్రద్ధా మొబైల్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించడంలో నిందితుడు చాలాసార్లు తన ప్రకటనలను మార్చాడని పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios