రెండున్నర గంటల పాటు సాగిన పోస్ట్ నార్కో టెస్టు.. నిందితుడు బయటపెట్టిన నిజాలు ఇవే..
అఫ్తాబ్ పూనావాలా పోస్ట్ నార్కో టెస్ట్: శ్రద్ధా హత్య కేసులో ప్రధాన నిందితుడు అఫ్తాబ్ పూనావాలాపై గురువారం నాడు నార్కో టెస్ట్ చేయగా..నేడు అతనిపై పోస్ట్ నార్కో టెస్ట్ నిర్వహించారు. తీహార్ జైలులో నిర్వహించిన ఈ టెస్ట్ రెండున్నర గంటల పాటు కొనసాగింది.
శ్రద్ధా హత్య కేసులో నిందితుడైన అఫ్తాబ్ పూనావాలాకు ఇవాళ పోస్ట్ నార్కో టెస్ట్ చేశారు. తీహార్ జైలులోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లోని సైకాలజిస్టులు ఈ పరీక్ష నిర్వహించారు. సుమారు 1 గంట 45 నిమిషాల పాటు జరిగిన ఈ పరీక్షలో నిందితుడు అనేక ప్రశ్నలకు సమాధానాలు లభించాయి. వాస్తవానికి ఈ పరీక్ష ఎఫ్‌ఎస్‌ఎల్ కార్యాలయంలో జరగాల్సి ఉంది. కానీ, భద్రత దృష్ట్యా.. అతనికి పోస్ట్ నార్కో టెస్ట్ ను తీహార్ జైలులోనే నిర్వహించారు. అఫ్తాబ్ పై నిర్వహించిన పాలిగ్రాఫ్, నార్కో టెస్ట్,పోస్ట్-నార్కో టెస్ట్ ఒకే ఫలితాలు వచ్చాయనీ, ఈ అన్ని పరీక్షల్లో అన్ని ప్రశ్నలకు సరిగ్గా ఒకే సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అఫ్తాబ్ పై పోస్ట్ నార్కో పరీక్ష నిర్వహించారు. కానీ.. ఈ పరీక్ష సమయంలో ఇచ్చిన సమాధానాలు సరైనవేనా ..? లేదా .. ? అని తెలుసుకోవడానికి.. అఫ్తాబ్ పై మరోసారి పోస్ట్ నార్కో పరీక్ష నిర్వహించారు. కాగా, అఫ్తాబ్ నార్కో పై నిర్వహించిన పరీక్ష పూర్తిగా విజయవంతమైందని అధికారులు తెలిపారు.
త్వరలో ఛార్జ్ షీట్ దాఖలు
శ్రద్దా హత్య కేసులో అఫ్తాబ్ నార్కో టెస్ట్‌పై ఆధారపడిన ఢిల్లీ పోలీసులు.. ఈ పరీక్షలు విజయవంతం కావడంతో వీలైనంత త్వరగా చార్జ్ షీట్‌ను కోర్టులో దాఖలు చేయాలని భావిస్తున్నారు. అయితే కోర్టులో చార్జిషీటు దాఖలు చేసేందుకు పోలీసులకు 90 రోజుల గడువు ఉంది. అఫ్తాబ్ పూనావాలాపై నార్కో పరీక్ష డిసెంబర్ 1న అంటే నిన్న జరిగింది. ఇందులో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. శ్రద్ధ అఫ్తాబ్‌ను విడిచిపెట్టాలనుకుంటోందని నార్కో పరీక్షలో వెల్లడైంది. ఈ కారణంగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ ఆవేశంలోనే అఫ్తాబ్ శ్రద్ధను చంపాడు. అనంతరం.. శ్రద్దా మృతదేహాన్ని ముక్కలుగా నరికినట్లు వెల్లడించారు.
మరో కీలక ప్రకటన
శ్రద్ధా హత్య కేసులో మరో కీలక ప్రకటన వెలువడింది. శ్రద్దా మృతదేహాన్ని అఫ్తాబ్ చైనీస్ కత్తులను ఉపయోగించి ముక్కలుగా నరికినట్లు వెల్లడైంది. ఇది కాకుండా..శ్రద్ధ శరీరాన్ని ముక్కలుగా నరికడానికి ఉపయోగించిన ఆయుధాన్ని గురుగ్రామ్‌లోని తన కార్యాలయం సమీపంలోని పొదల్లో విసిరినట్లు నార్కో పరీక్ష సమయంలో తెలిపాడు.
పోస్ట్ నార్కో టెస్ట్ అంటే ఏమిటి?
ఎఫ్‌ఎస్‌ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సంజీవ్ గుప్తా మాట్లాడుతూ.. పాలిగ్రాఫ్ టెస్ట్, నార్కో టెస్ట్‌లో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు విభిన్నంగా ఉన్నాయని చెప్పారు. ఓకే ప్రశ్నకు వివిధ సమాధానాలిస్తే.. పోస్ట్ నార్కో పరీక్ష పునరావృతం చేస్తారని తెలిపారు. ఈ ప్రక్రియ 2 నుండి 4 గంటలు పడుతుంది. పోస్ట్ నార్కో పరీక్ష అనేది సంక్లిష్టమైన ప్రక్రియ. దీనికి చాలా గంటలు పడుతుంది. దర్యాప్తు అధికారులు పోస్ట్ నార్కో పరీక్ష ద్వారా వాస్తవాలను వెలికి తీయవచ్చు. ఇదో ప్రయత్నమని తెలిపారు.
ఈమేరకు గురువారం రోహిణిలోని అంబేద్కర్ ఆస్పత్రిలో అఫ్తాబ్‌కు నార్కో టెస్టు నిర్వహించారు. అఫ్తాబ్ పై నార్కో టెస్ట్ రెండు గంటల పాటు కొనసాగిందని తెలిపారు. నార్కో పరీక్షలో ఫోరెన్సిక్ ల్యాబ్ రోహిణికి చెందిన సైకాలజిస్టులు, వైద్యులు, ఫోటో నిపుణులు కూడా ఉన్నారు. అఫ్తాబ్ నార్కో పరీక్ష విజయవంతమైందని ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు ప్రకటించారు. దీంతో పాటు నార్కో టెస్టు నివేదికను త్వరలో సిద్ధం చేస్తామని అధికారులు వెల్లడించారు.