Asianet News TeluguAsianet News Telugu

ఆరోజు పోలీసులు సహాయం చేసి ఉంటే.. ఈ రోజు నా కుమార్తె బతికి ఉండేది: శ్ర‌ద్ధా తండ్రి 

శ్రద్ధా హత్య కేసుకు సంబంధించి శ్రద్ధా వాకర్ తండ్రి వికాస్ వాకర్ శుక్రవారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముంబైలోని ఆయన నివాసంలో కలిశారు. అనంతరం ఆయన  విలేకరుల సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు.
 

Shraddha Walkar father demanded the maximum punishment for Aaftab Amin Poonawala
Author
First Published Dec 9, 2022, 4:31 PM IST

శ్రద్ధా హత్య కేసుకు సంబంధించి శ్రద్ధా వాకర్ తండ్రి వికాస్ వాకర్ శుక్రవారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముంబైలోని ఆయన నివాసంలో కలిశారు. అనంతరం ఆయన మీడియాతో  మాట్లాడుతూ.. తనకు న్యాయం చేస్తామని ఫడ్నవీస్ హామీ ఇచ్చారని చెప్పారు. శ్రద్ధా వాకర్ తండ్రి ఫడ్నవీస్‌ను కలిసేందుకు వెళ్లగా బీజేపీకి చెందిన కిరీట్ సోమయ్య కూడా అక్కడికి చేరుకున్నారు. శ్రద్ధను గొంతుకోసి హత్య చేసి, ఆపై ఆమె శరీరాన్ని 35 భాగాలుగా కోసి చంపిన శ్రద్ధా జీవిత భాగస్వామి ఆఫ్తాబ్ పూనావాలా, సాకేత్ కోర్టు శుక్రవారం కస్టడీని పొడిగించడంతో మరో 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు . వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆఫ్తాబ్‌ను కోర్టు ముందు హాజరుపరిచారు.

తాను ఇప్పటికే ఢిల్లీ గవర్నర్, దక్షిణ ఢిల్లీ డిసిపిని కలిశాననీ తెలిపారు. వారు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారనీ, ఇప్పుడు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశాననీ, వారు కూడా అదే హామీ ఇచ్చాడని  వికాస్ వాకర్ చెప్పారు. శ్రద్ధను చంపిన ఆఫ్తాబ్ గురించి ఆయన మాట్లాడుతూ.. ఆఫ్తాబ్ పూనావాలాకు గరిష్ట శిక్ష విధించాలనీ, అతని తల్లిదండ్రులను కూడా పోలీసులు విచారించాలని అన్నారని, ప్రస్తుతం కేసులో దర్యాప్తు పురోగతిలో ఉన్నప్పటికీ, ప్రారంభంలో కొంత ఆలస్యం జరిగిందని శద్రా తండ్రి వికాస్ వాకర్ చెప్పారు.

ఢిల్లీలో తన కూతురు .. అఫ్తాబ్ అమీన్ పూనావల్ల చేతుల్లో హత్య కాబడిందని అన్నారు. తన కుమార్తె ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చెప్పిన మాటలను ఆయన గుర్తు చేసుకున్నాడు. అలాగే వసాయ్ పోలీసుల వల్ల తాను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని.. ఆ రోజు తనకి వారు సహాయం చేసి ఉంటే.. ఈరోజు నా కూతురు బతికే ఉండేదని అన్నారు. వికాస్ వాకర్ చాలా బరువెక్కిన హృదయంతో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 18 ఏళ్లు మరియు అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను  ఇలాంటి విషయాలపై కౌన్సెలింగ్ ఇవ్వాలని అన్నారు.  

 వికాస్ వాకర్ ఇంకా మాట్లాడుతూ.. తాను శ్రద్ధాతో చివరిసారిగా 2021లో మాట్లాడాననీ,ఆ సమయంలో తాను బెంగళూరులో నివసిస్తోందని చెప్పిందని తెలిపారు. ఆ తరువాత సెప్టెంబర్ 26న తన కూతురు గురించి అఫ్తాబ్‌తో మాట్లాడాననీ, కానీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలిపాడు. అతని మాటల్లో అనుమానం రావడంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. తన కుమార్తె హత్యకు గురైనట్లుగా.. మరో అమ్మాయి బలికావద్దని, అఫ్తాబ్ పూన్‌వాలాకు కఠినంగా శిక్షించాలని, అది గుణపాఠం కావాలని ఆశిస్తున్నానని అన్నారు. ఈ హత్యలో అఫ్తాబ్ కుటుంబం, బంధువులు, ఇతరుల ప్రమేయం ఉందో లేదో కూడా విచారించాలని కోరారు. 

మరోవైపు.. శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ సాకేత్ కోర్టు 14 రోజుల పాటు పొడిగించింది. నిందితుడిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. అంతకుముందు అఫ్తాబ్ కస్టడీని కోర్టు 13 రోజుల పాటు పొడిగించింది. ఏఎన్ఐ అందిన సమాచారం ప్రకారం.. ఢిల్లీ సాకేత్ కోర్టు శ్రద్ధ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా యొక్క జ్యుడిషియల్ కస్టడీని 14 రోజుల పాటు పొడిగించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతడిని ప్రొడ్యూస్ చేశారు.

ఢిల్లీ పోలీసులు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరారని, విచారణ జరుగుతోందని చెప్పారు. శ్రద్దా వాకర్ హత్య కేసును విచారిస్తున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తులో సహాయం చేయడానికి ఆఫ్తాబ్ ఖాతా వివరాలను అందించాలని బంబుల్‌ (డేటింగ్ యాప్)ను కోరారు. నివేదికల ప్రకారం.. అఫ్తాబ్ చాలా మంది అమ్మాయిలను సంప్రదించాడు. అంతేకాదు ఆ అమ్మాయిలను తన ఫ్లాట్‌కి తీసుకొచ్చుకున్నాడు. ఆ సమయంలో శ్రద్ధా మృతదేహం ఫ్రిడ్జ్ లోనే ఉంచాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios