జమ్మూకశ్మీర్ లో ఓ మహిళను కిడ్నాప్ చేసిన ఓ వ్యక్తి ఆమెను అతి దారుణంగా హత్య చేశాడు. ఆమె తల నరికి.. శరీరాన్న ముక్కలుగా చేసి వివిద ప్రదేశాల్లో పడేశాడు. 

జమ్మూ కాశ్మీర్ : శ్రద్ధ వాకర్ లాంటి హత్య కేసు తాజాగా జమ్మూ కశ్మీర్ లో ఒకటి వెలుగు చూసింది. ఓ 30 ఏళ్ల మహిళను అతి దారుణంగా హత్య చేసి, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి.. వేరువేరు ప్రదేశాల్లో పడేశారు. ఆ మహిళ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తులో ఈ విషయాలు వెలుగు చూశాయి. ఈ దారుణానికి ఒడిగట్టిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడైన షబ్బీర్ అహ్మద్ ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతడు వృత్తిరీత్యా వడ్రంగి కావడంతో ఆమె శరీరాన్ని అనేక ముక్కలుగా నరికేశాడు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మార్చి 7వ తేదీన బాధితురాలు రోజులాగే కోచింగ్ క్లాస్ కి వెళ్ళింది. కానీ రోజు వచ్చే సమయానికి తిరిగి రాలేదు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు మరుసటి రోజు సోయిబాగ్ పోలీస్ స్టేషన్లో ఆమె మిస్సింగ్ అంటూ ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరోసారి తెరపైకి ప్రధాని భద్రతా వైఫల్యం.. పంజాబ్‭ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్రం

ఈ క్రమంలోనే షబ్బీర్ అహ్మద్, అజీజ్ మరికొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని తమదైన రీతిలో విచారించారు. ఈ విచారణలో షబ్బీర్ తానే నిందితుడు అని ఒప్పుకున్నాడు. మహిళను హత్య చేసినట్లుగా అంగీకరించాడు. ‘మోహన్ పురాలోని నా ఇంటికి మహిళను తీసుకువెళ్లాను. అక్కడే ఆమెను చంపేశాను. ఆ తరువాత విషయం.. బయటికి రాకూడదని ఆమె తలను నరికి వేశాను. శరీర భాగాలను కూడా ముక్కలుగా చేసి, వేర్వేరు ప్రదేశాల్లో పడేశాను’ అని నిందితుడు ఒప్పుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.

మరోవైపు, జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో వారం రోజుల క్రితం అదృశ్యమైన మహిళ మృతదేహంగా లభించడం.. ఆమె తల, శరీరభాగాలు నరికివేసి.. వివిధ చోట్ల పడేయడం వెలుగులోకి రావడంతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. నిందితుడు షబీర్ అహ్మద్ (45) కార్పెంటర్ అని, అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతను చెప్పినదాని ఆధారంగా, అనేక ప్రదేశాల నుండి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అహ్మద్ తనకు తెలిసిన 30 ఏళ్ల మహిళను కిడ్నాప్ చేశాడని.. ఆ తరుాత ఆమెను చంపి, ఆమె మృతదేహాన్ని నరికి, వాటిని అనేక ప్రదేశాల్లో పడవేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దారుణ హత్య నిరసనలకు దారితీసింది, వందలాది మంది అహ్మద్ ఇంటి బయట నిరసనకు దిగారు. అతనిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో నిరసనలో మహిళలు పాల్గొన్నారు. నిందితుడిని తమకు అప్పగించాలని, మహిళకు పట్టిన అదే గతి అతనికి పట్టాలని అన్నారు. 

ఇది "అరుదైన" కేసు అని, మరొకరు ఇలా చేయకుండా ఉండే కఠినమైన శిక్ష విధించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. మహిళకు ఇటీవలే నిశ్చితార్థం జరిగిందని, దానికి అహ్మద్ అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోందని పోలీసు వర్గాలు తెలిపాయి. మార్చి 7న ఆమె కనిపించకుండా పోయింది, ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.