మీరు పానీపూరి ప్రియులా ... ఈ వీడియో చూసారో మీ ఇష్టాన్ని మార్చుకుంటారు

పానీపూరి అంటే పడిచచ్చే యువతకు ఇదో కనువిప్పు వీడియో. వాటిని ఎలా తయారుచేస్తారో చూపించే  ఓ వీడియో సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. మీరూ ఆ వీడియోను చూడండి. 

Shocking Pani Puri Preparation Video Goes Viral: Harpic, Urea, and Unhygienic Practices Exposed! AKP

నేటి యువత మరి ముఖ్యంగా అమ్మాయిలు పానీపూరి అంటే పడిచస్తుంటారు. హైదరాబాద్ వంటి మహానగరంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోని చిన్నచిన్న పట్టణాలు, మారుమూల పల్లెలకు కూడా ఈ పానీపూరి పాకింది.  పానీ పూరీ బండ్ల వద్ద వినిపించే 'భయ్యా తోడా ప్యాజ్ దాలో' అనే పదం ఏ స్థాయిలో ఫేమస్ అయ్యిందో అందరికీ తెలుసు... దీన్నిబట్టే పానీపూరీ ఎంత ఫేమస్సో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ పానీపూరీని ఎలా తయారుచేస్తారో చూసారో మీరు మరోసారి వాటిని తినడం కాదుకదా పేరెత్తడానికే ఇష్టపడరు. ఇలాంటి పానీపూరి తయారీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

జార్ఖండ్ రాష్ట్రంలోని గర్వా జిల్లా మజిగవన్  బజార్ ప్రాంతానికి చెందిన అంశు, రాఘవేంద్ర పానీపూరి వ్యాపారం చేస్తుంటారు. వీళ్లే స్వయంగా పానీపూరీలను పెద్దమొత్తంలో తయారుచేస్తుంటారు. అయితే వీరిద్దరు ఇటీవల పానీపూరీ తయారీ విధానాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. 

అయితే పానీపూరీ తయారీ కోసం పిండిని ఎలా రెడీ చేసుకుంటారో ఈ వీడియోలో చూపించారు. పిండిని నేలపై వేసి కాళ్లతో తొక్కుతూ అత్యంత జుగుప్సాకరంగా ఆ తయారీవిధానం వుంది. అలాగే టేస్ట్ కోసం ఈ పిండితో అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ ఉపయోగించారు. ఇందులో బాత్రూం క్లీనింగ్ కోసం ఉపయోగించే హార్పిక్, పంటకు వేసే యూరియా కూడా వున్నాయి.

ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ప్రమాదకరంగా పానీపూరీ తయారుచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో స్థానిక అధికారులు వెంటనే స్పందించి అశు, రాఘవేంద్రలను అరెస్ట్ చేసారు. పానీపూరీ తయారీకోసం ఉపయోగించే పదార్థాలు, రసాయాలను స్వాదీనం చేసుకుని టెస్ట్ లకు పంపించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోంది. అయితే ఈ వీడియోను చూసినవారు, స్థానిక ప్రజలు ఇలాంటివారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 


 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios