భార్య లావుగా ఉందని ఓ భర్త.. కట్టుకున్న భార్యను ఇంటి నుంచి గెంటేశాడు. ఈ దారుణ సంఘటన గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే...  అహ్మదాబాద్, మహిళా వెస్ట్ పోలీస్ స్టేషన్  పరిధిలో ఉన్న రెసిడెంట్ కు చెందిన ఓ మహిళకు 2017లో వివాహం జరిగింది.  ఆరు నెలలపాటు వారి సంసారం బాగానే సాగింది. ఆ తర్వాత భార్యను వేధించడం మొదలుపెట్టాడు.

లావుగా ఉన్నావంటూ తిట్టడం, వేధించడం మొదలుపెట్టాడు. తన తల్లిదండ్రుల బలవంతం కారణంగానే ఆమెను పెళ్లి చేసుకున్నానని చెప్పి ఎగతాళి చేసేవాడు. ఓ నెల క్రితం ఇళ్లు కొనడానికి ఆమె వద్దనుంచి దాదాపు 3 లక్షల రూపాయలు ఇప్పించుకున్నాడు. ఆ వెంటనే ఆమెను ఇంటినుంచి బయటకు గెంటేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి, భర్త, అతడి సోదరులపై ఫిర్యాదు చేసింది. కాగా.. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.