ముంబైలోని ఓ పానీపూరి బండి అతను పానీపూరి వాటర్ లో టాయ్ లెట్ వాటర్ కలుపుతూ వీడియోకు చిక్కాడు. కొల్హాపురిలో జరిగిన ఈ సంఘటనలో వీడియో వైరల్ అవ్వడంతో కస్టమర్లు ఆ బండిని ధ్వంసం చేశారు.

కొల్హాపూర్ లోని రంకాలా లేక్ దగ్గర ముంబాయి కె స్పెషల్ పానీపూరీ వాలా బండి చాలా ఫేమస్. ఎంతో మంది ఇక్కడ పానీపూరీ తినడానికి క్యూలు కడతారు. ఇక్కడ పానీపూరి చాలా రుచిగా ఉంటుందని ఎక్కడెక్కడినుండో వస్తుంటారు.

అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో పానీపూరి బండి నడిపే వ్యక్తి దగ్గర్లో ఉన్న టాయిలెట్లోని నళ్లానుండి నీళ్లు పట్టి వాటిని పానీపూరి నీటిలో కలపడం ఉంది. ఇది చూసిన కస్టమర్లు అవాక్కయ్యారు. కోపంతో ఊగిపోయి అతని బండిని నాశనం చేశారు. 

ఈ సంఘటన స్ట్రీట్ ఫుడ్ ను ఇష్టపడే వారందరికీ ఓ కనువిప్పుగా చెప్పవచ్చు. తినేముందు పరిసరాలు, వాటిని ఎలా తయారు చేస్తున్నారు అన్న దానిమీద ఓ కన్నేసి ఉంచడం మంచిది.