Palghar: తమ సంబంధాన్ని తమ కుటుంబాలు అంగీకరించవేమోననే భ‌యంతో ఓ ప్రేమ‌జంట ప్రాణాలు తీసుకుంది. క‌లిసి జీవించ‌లేమ‌నే భ‌యంతో క‌లిసి చ‌నిపోవాల‌ని నిర్ణ‌యించుకుని ఆత్మ‌హత్య చేసుకున్నారు. కేసు న‌మోదుసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. 

Woman, boyfriend commit suicide in Palghar: తమ ప్రేమ‌ను తమ కుటుంబాలు అంగీకరించవేమోననే భ‌యంతో ఓ ప్రేమ‌జంట ప్రాణాలు తీసుకుంది. క‌లిసి జీవించ‌లేమ‌నే భ‌యంతో క‌లిసి చ‌నిపోవాల‌ని నిర్ణ‌యించుకుని ఆత్మ‌హత్య చేసుకున్నారు. కేసు న‌మోదుసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. ఈ షాకింగ్ ఘ‌ట‌న మ‌హారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. 

ఈ విషాద ఘ‌ట‌న గురించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో 20 ఏళ్ల యువతి, 19 ఏండ్ల ఆమె ప్రియుడు తమ ప్రేమ‌ను కుటుంబ సభ్యులు అంగీకరించరనే భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం సాయంత్రం తలసరి ప్రాంతంలోని కొండపై చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను గమనించిన ఓ వ్యక్తి స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తలసరి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు.

తమ సంబంధాన్ని తమ కుటుంబాలు అంగీకరించవేమోనని వారిద్దరికీ నిరంతరం భయం ఉండేది. క‌లిసి జీవించ‌లేమ‌నే భ‌యంతో క‌లిసి చ‌నిపోవాల‌ని నిర్ణ‌యించుకుని ఆత్మ‌హత్య చేసుకున్నారు. కొండ ప్రాంతంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసినట్లు పాల్ఘర్ గ్రామీణ పోలీస్ కంట్రోల్ రూమ్ అధికారి ఒకరు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌న్నారు.ః

హైదరాబాద్ లోనూ.. 

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ లో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. చాలా కాలంగా ప్రేమించుకుంటున్న ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిద్దరి ఆత్మహత్యకు కారణం వీరి కుటుంబాల్లో వీరి ప్రేమను అంగీకరించకపోవడమే అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతులను ఆంధ్రప్రదేశ్ లోని భీమవరానికి చెందిన జ్యోతి, శ్యామ్ లుగా గుర్తించారు. వీరిద్దరూ హైదరాబాదులో ఓ పెళ్లికి హాజరవడానికి వచ్చారు. ఆ తర్వాత స్నేహితుడు రూమ్ కి వచ్చిన వీరు అక్కడే ఆత్మహత్య చేసుకున్నారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు.