Palghar: మహారాష్ట్రలో గొడవపడి ఒక కొడుకు తన కన్నతల్లి ప్రాణాలు తీశాడు. పాల్ఘర్ లో గురువారం జరిగిన గొడవలో తల్లిని హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు.
Son Killed Mother in Maharashtra: మహారాష్ట్రలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. గొడవపడి ఒక కొడుకు తన కన్నతల్లి ప్రాణాలు తీశాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకెళ్తే.. పాల్ఘర్ జిల్లాలో తల్లిని హత్య చేసిన 26 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీనికి ఇద్దరి మధ్య చోటుచేసుకున్న వాగ్వాదమే కారణంగా తెలుస్తోంది. నిందితుడు తన తల్లితో వాగ్వాదానికి దిగిన తర్వాత ఆవేశంలో ఆమె ప్రాణాలు తీసినట్టు పోలీసులు వర్గాలు తెలిపాయి. అయితే, దీనిపై పూర్తి విచారణ జరిపిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఇద్దరి మధ్య ఇదివరకు వాగ్వాదం జరిగింది. మళ్లీ గురువారం (మార్చి 9) నాడు కూడా వివాదం మరింతగా పెరిగింది. ఈ క్రమంలోనే నిందితుడు తన తల్లిని గొంతు నులిమి చంపేశాడు. శుక్రవారం (మార్చి 10) ఏదో విషయంలో జరిగిన వాగ్వాదం తర్వాత ఈ ఘటన జరిగిందని ఓ అధికారి తెలిపారు.
విరార్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. వైశాలి ధను (44) తన కుమారుడితో కలిసి విరార్ లోని ఫూల్పారా ప్రాంతంలోని గాంధీ నగర్ కాలనీలో నివసిస్తోంది. కొద్ది రోజుల క్రితం వివాహ వేడుకలో తల్లీకొడుకుల మధ్య ఏదో విషయమై వాగ్వాదం జరిగింది. గురువారం మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కొడుకు తల్లిని చంపేశాడని తెలిపారు. కొద్దిసేపటి తర్వాత మృతురాలి తల్లి అక్కడికి చేరుకుని చూడగా ధను మంచంపై కదలకుండా పడివుండటం గమనించింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
