Gandhinagar: వేరే వ్యక్తితో అక్రమసంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ భర్త అందరూ చూస్తుండగానే బస్సులో వెళ్తుండగా తన భార్య గొంతు కోసి హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన గురించి అక్కడున్న వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చేంత వరకు నిందితుడైన పోలీసు అధికారి శవం పక్కనే బస్సులో కూర్చుని ఉన్నాడు.
Shocking incident in Gujarat: వేరే వ్యక్తితో అక్రమసంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ భర్త అందరూ చూస్తుండగానే బస్సులో వెళ్తుండగా తన భార్య గొంతు కోసి హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన గురించి అక్కడున్న వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చేంత వరకు నిందితుడు శవం పక్కనే బస్సులో కూర్చుని ఉన్నాడు. ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకెళ్తే.. తన భార్య వేరేవాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో గుజరాత్ వ్యక్తి బస్సులో భార్య గొంతు కోసి, పోలీసులు వచ్చే వరకు శవంతో అక్కడే కూర్చున్నాడు. అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో గుజరాత్ పోలీసు అధికారి మంగళవారం తన భార్య గొంతు కోశాడని పోలీసులు తెలిపారు. కండక్టర్‌గా పనిచేస్తున్న ఆమె ప్రయాణిస్తున్న బస్సులోనే హత్య జరిగిందని చెప్పారు. చోటా ఉదేపూర్‌లో మంగళవారం కదులుతున్న బస్సులో తన భార్యను గొంతు కోసి హత్య చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేశామని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ నేరానికి పాల్పడిన నిందితుడు సూరత్ జిల్లాలో పనిచేస్తున్న పోలీసు అధికారి అమృత్ రాత్వాగా గుర్తించారు.
అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భార్యను హత్య చేయడానికి అతను 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాడు. ఈ దుర్ఘటన జరిగినప్పుడు భార్య మంగుబెన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని జీఎస్ఆర్టీసీలో కండక్టర్గా విధులు నిర్వర్తిస్తోంది. ఫోన్ లో పదేపదే గొడవలు జరిగిన తరువాత అమృత్ తన భార్యను చంపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీని కోసం అనుకున్న విధంగానే ముందస్తు ప్రణాళికతో ఆమె గొంతుకోసి ప్రాణాలు తీశాడు. మంగళవారం తన భార్య పనిచేసే భిఖాపూర్ గ్రామం నుంచి బస్సు ఎక్కాడు. మంగుబెన్ కండక్టర్ సీటులో కూర్చుని ఉంది. అమృత్ మంగుబెన్ ను గుర్తించి, వేగంగా ఆమె వైపు కదిలి, ఆమెను కత్తితో పొడవడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఆమె గొంతు కోయడంతో అక్కడికక్కడే మరణించింది.
హత్య జరిగిన తర్వాత అమృత్ శవం దగ్గర బస్సులోనే కూర్చుని ఉన్నాడు. పోలీసులు వచ్చే వరకు అతను అక్కడి నుంచి వెళ్లలేదు. అతనిపై హత్య అభియోగం మోపబడిందనీ, తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టంకు పంపినట్టు వెల్లడించారు.
