ప్రధాని నరేంద్ర మోడీకి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఉద్దేశం సరిగా అర్థం కాలేదని తాను గ్రహించానని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని మోడీ లోక్ సభలో చేసిన వ్యాఖ్యలు విని తాను ఆశ్చర్యానికి లోనయ్యానని తెలిపారు. 

లోక్‌సభలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)కి వ్యతిరేకంగా ప్రధాని మాట్లాడిన మాటలు విని తాను షాక్‌కు అయ్యాన‌ని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ అన్నారు. శ‌నివారం తన లోక్‌సభ నియోజకవర్గం వాయనాడ్‌లో జరిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న ప్ర‌ధానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సామాజిక భద్రతా చర్యను ప్రధాని మోదీ విమర్శించిన తీరును చూస్తే MGNREGA లోతును ఆయ‌న అర్థం చేసుకోలేకపోతున్నానని గ్రహించానని అన్నారు.

హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని

‘‘ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కంకు ను వ్య‌తిరేకిస్తూ ప్ర‌ధాని లోక్ స‌భ‌లో మాట్లాడ‌టం విని దిగ్భ్రాంతికి గురయ్యాను. యూపీఏ వైఫల్యాల సజీవ స్మారక చిహ్నంగా ఆయ‌న (మోడీ) దానిని పేర్కొన్నారు. ఆయ‌న దానిని ఖజానాకు హరించడం అని అన్నారు. అంటే ఈ ప‌థ‌కం లోతు ప్రధానమంత్రికి అసలు అర్థం కాలేదని నాకు అర్థమైంది. ’’ అని రాహుల్ గాంధీ అన్నారని వార్తా సంస్థ ANI పేర్కొంది. దేశంలోని లక్షలాది మందికి ఉపాధి హామీ ప‌థ‌కం చివ‌రి మార్గం అని, సెక్యూరిటీ అని ప్ర‌ధాని అర్థం చేసుకోలేక‌పోతున్నార‌ని రాహుల్ గాంధీ అన్నారు. ఈ మ‌హత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం భారతీయ కార్మిక మార్కెట్‌ను ఎప్పటికీ మార్చివేసిందని ప్ర‌ధానికి అర్థం కాలేద‌ని తెలిపారు. మిలియ‌న్ల మంది ప్ర‌జ‌లు దీనిపై ఆధార‌ప‌డ్డార‌ని చెప్పారు. 

Scroll to load tweet…

పెరుగుతున్న ధనిక, పేద అంతరంపై మోదీ ప్రభుత్వంపై రాహుల్ విరుచుకుపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం రెండు భారతదేశాలను సృష్టించిందని అన్నారు. అందులో ఒక‌టి ధ‌న‌వంతుల‌కు కాగా మ‌రొక‌టి పేద‌ల‌కు అని ఆరోపించారు. అంబుజా సిమెంట్, ACC లలో అదానీ గ్రూప్ 6.38 యూఎస్ బిలియ‌న్ డాల‌ర్ల Holcim వాటాను ఎలాంటి పన్ను లేకుండా కొనుగోలు చేస్తోంద‌ని అన్నారు. అదే స‌మ‌యంలో మిలియన్ల మంది పేద పిల్లలకు త‌మ భోజ‌నం పొందేందుకు ఆధార్ ఐడీలు కావాల్సి వ‌స్తోంద‌ని ఆయ‌న ప‌లు మీడియా క‌థ‌నాల‌ను ఉదాహ‌ర‌ణ‌గా చెప్పారు.