Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ సగం సీట్లు ఇస్తే సరి.. లేదంటే విడిపోవడమే: శివసేన ఎంపీ సంజయ్

పొత్తులో భాగంగా తమకు సగం స్థానాలను ఇవ్వడంలో బీజేపీ విఫలమైతే కూటమి నుంచి వైదొలగుతామని స్పష్టం చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్, అమిత్ షాల సమక్షంలో కుదిరిన ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములాను బీజేపీ గౌరవించాలని సంజయ్ కోరారు. 

shivsena mp sanjay raut warns bjp over seat sharing in maharastra assembly Elections
Author
Mumbai, First Published Sep 19, 2019, 2:56 PM IST

త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల మధ్య అప్పుుడే పొత్తు రాజకీయాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బీజేపీ అధినాయకత్వానికి గట్టి హెచ్చరికలు పంపారు.

పొత్తులో భాగంగా తమకు సగం స్థానాలను ఇవ్వడంలో బీజేపీ విఫలమైతే కూటమి నుంచి వైదొలగుతామని స్పష్టం చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్, అమిత్ షాల సమక్షంలో కుదిరిన ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములాను బీజేపీ గౌరవించాలని సంజయ్ కోరారు.

మరోవైపు శివసేనకు 124 స్థానాలకు మించి ఇవ్వలేమని బీజేపీ చెబుతోందనే వార్తలతో సేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైతే ఒంటరిపోరుకు సిద్ధం కావాలని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే పార్టీ శ్రేణులను కోరినట్లుగా తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios