Shivsena Attacks BJP: మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడంపై శివసేన అధికారిక పత్రిక సామ్నా తన సంపాదకీయంలో దుయ్యబట్టింది. దివంగత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వంటి నాయకుల జ్ఞాపకాలను తుడిచివేయడమే కాకుండా.. నెహ్రూ-గాంధీ కుటుంబ అవకాశాలను కూడా నాశనం చేయాలని బిజెపి కుట్ర చేస్తోందని ఆరోపించింది.
Shivsena Attacks BJP: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై శివసేన పార్టీ తీవ్రస్థాయిలో విరుచుక పడింది. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వంటి దివంగత కాంగ్రెస్ నాయకుల జ్ఞాపకాలను తుడిచివేయడమే కాకుండా.. నెహ్రూ-గాంధీ రాజవంశం యొక్క అవకాశాలను నాశనం చేయాలని బిజెపి కుట్ర చేస్తోందని శివసేన ఆరోపించింది. మనీల్యాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారించడంపై శివసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రత్యర్థి పార్టీలను అంతమొందించేందుకు హిట్లర్ గ్యాస్ ఛాంబర్లను నిర్మించడం ఒక్కటే మిగిలిందని.. ఆ పనిని కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తోందని, బీజేపీ వ్యవహర తీరును శివసేన తప్పుపట్టింది.
మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడంపై శివసేన అధికారిక పత్రిక సామ్నా తన సంపాదకీయంలో దుయ్యబట్టింది. రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడం ద్వారా.. బీజేపీ ఎంతటి శక్తివంతమైన నాయకుడి కాలర్ అయినా పట్టుకుంటుందనే సంకేతాలు పంపేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొంది. సామ్నా దీనిని అధికార దురహంకారంగా పేర్కొంది. దర్యాప్తు సంస్ధలను ప్రయోగించి ఇవాళ రాహుల్, సోనియా గాంధీని వేధిస్తున్నారని, రేపు మరొకరి వంతని ఆందోళన వ్యక్తం చేసింది.శివసేన, ఆర్జేడీ, ఎస్‌పీ, జేఎంఎం, కాంగ్రెస్, టీఎంసీ వంటి పార్టీలపై ఈడీ నిఘాలో ఉన్నాయని పేర్కొంది. ఈడీ ఎన్నడూ బీజేపీ నేతపై దాడి చేసిన దాఖలాలు లేవని తెలిపింది.
సామ్నా సంపాదకీయంలో ఇలా పేర్కొంది. “BJP పండిట్ నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీల జ్ఞాపకాలను చెరిపివేయాలని కోరుకుంటుంది. అలాగే.. నెహ్రూ-గాంధీ రాజవంశం అవకాశాలను నాశనం చేయడానికి కూడా పూనుకుంది. ఈరోజు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను టార్గెట్ చేశారు. రేపు ఇంకా ఎవరైనా టార్గెట్ చేయవచ్చని సామ్నాపేర్కొంది. హిట్లర్ లాగా ప్రత్యర్థులను అంతమొందించేందుకు విషపూరిత గ్యాస్ ఛాంబర్లను నిర్మించాల్సిన ప్రయత్నిస్తోందని ఆరోపించింది.
శివసేన, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ), సమాజ్‌వాదీ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌లు కూడా ఈడీ రాడార్‌లో ఉన్నాయని, ప్రతిపక్షాల ప్రతిపనిపై బీజేపీ నిఘా పెట్టింది. ఇంతవరకూ బీజేపీ నాయకులపై ఈడీ, సీబీఐ దాడులు జరిగిన దాఖాల్లేవు. అలాంటప్పుడు సమానత్వం ఎక్కడ ఉంది' అని సామ్నా సంపాదకీయం పేర్కొంది. అనిల్ దేశ్‌ముఖ్, నవాబ్ మాలిక్, అభిషేక్ బెనర్జీ, అనిల్ పరబ్, సంజయ్ రౌత్, లాలూ ప్రసాద్ యాదవ్‌లపై కేసు నమోదు చేయడం మాత్రమే ఈడీ పని అని సామ్నా ఆరోపించింది.
