Asianet News TeluguAsianet News Telugu

సాయంత్రం 5 గంటలకు మీటింగ్.. రాకుంటే పార్టీ నుంచి తొలగింపు: ఎమ్మెల్యేలకు శివసేన ఆదేశాలు.. గువహతిలో రెబల్స్ భేటీ

మహారాష్ట్రలో హైడ్రామా కొనసాగుతుండగా.. ఉద్ధవ్ ఠాక్రే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశానికి పిలుపు ఇచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్నవారే శివసేన ఎమ్మెల్యేలు అని, హాజరుకాని వారిని పార్టీని బహిష్కరిస్తామని విప్ వార్నింగ్ ఇచ్చింది.
 

shivasena to convence meeting for party mlas in the evening 5 pm
Author
Mumbai, First Published Jun 22, 2022, 3:42 PM IST

ముంబయి:  మహారాష్ట్రలో పొలిటికల్ హైడ్రామా ఇంకా కొనసాగుతున్నది. రెబల్ ఎమ్మెల్యేలు తమ డిమాండ్లతో ప్రభుత్వానికే అల్టిమేటం ఇవ్వడంతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం డైలామాలో పడినట్టుగా తెలుస్తున్నది. ఏక్‌నాథ్ షిండే తన వద్ద 40 మంది శివసేన ఎమ్మెల్యేలు, ఆరుగురు స్వతంత్రులు ఉన్నట్టు పేర్కొన్నారు. అదే నిజమైతే.. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం మరెన్నో రోజులు కొనసాగేలా లేదు. ఈ నేపథ్యంలోనే శివసేన పార్టీ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నది.

కరోనా బారిన పడ్డ ఉద్ధవ్ ఠాక్రే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ మంత్రివర్గ భేటీ కేవలం ఎజెండాకే పరిమితం అయినట్టు ఇందులో పాల్గొన్న నేతలు చెప్పారు. అయితే, ఈ రోజు సాయంత్రం 5 గంటలకు శివసేన ఎమ్మెల్యేలు అందరూ ఎట్టి పరిస్థితుల్లో హాజరవ్వాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కచ్చితంగా హాజరవ్వాలని విప్ జారీ చేశారు. ఈ భేటీకి హాజరు కానివారు పార్టీ నుంచి బయటకు వెళ్లాలని భావిస్తున్నట్టుగా తలుస్తామని ఆ విప్ ఆదేశం తెలిపింది. ఆ కారణంగానే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహించే సమావేశానికి హాజరు కానివారిపై చర్యలు తీసుకుని అనర్హత వేటు వేస్తామని, పార్టీ నుంచి వారిని బహిష్కరిస్తామని స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా, రెబల్ శిబిరం గుజరాత్ నుంచి బీజేపీ పాలిత అసోంకు వెళ్లింది. హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఉన్న అసోంలో రెబల్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. తాను మొదటి నుంచీ శివసేన.. బీజేపీతోనే పొత్తు పెట్టుకోవాలని భావించానని, కాంగ్రెస్, ఎన్సీపీల తీరు తమకు నచ్చదని గువహతిలో పేర్కొన్నారు. శివసేన ఎమ్మెల్యేలకు పార్టీ గట్టి వార్నింగ్‌తో కూడిన విప్ ఆదేశం ఇచ్చిన తర్వాత గువహతిలో ఏక్‌నాథ్ షిండే రెబల్స్‌తో ఓ భేటీని నిర్వహిస్తున్నారు. 

కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ రద్దు చేస్తారని వచ్చిన వార్తలను మహారాష్ట్ర మంత్రి కొట్టేశారు. అలాగే, సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేస్తున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయని, అవి నిజం కాదని సంజయ్ రౌత్ తెలిపారు. శివసేన ఎమ్మెల్యేలు ముంబయి వచ్చే వరకు ఆయన తన రాజీనామా చేయరని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, పరిస్థితులు తమ అదుపులోనే ఉన్నాయని నవ్వు ముఖంతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారని, కాంగ్రెస్ లీడర్ నితిన్ రౌత్ వెల్లడించారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నవ్వుతూ మాట్లాడారని మినిస్టర్, కాంగ్రెస్ నేత నితిన్ రౌత్ అన్నారు. 

మహారాష్ట్రలో సంక్షోభం కొనసాగుతున్న క్రమంలో ఎన్సీపీ కీలక ప్రకటన వెల్లడించింది. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురువారం జూన్ 23ని నిర్వహించే సమావేశానికి హాజరవ్వాలని ఎన్సీపీ ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios