Asianet News TeluguAsianet News Telugu

కరోనా: కేంద్రం తీరుపై శివసేన ఫైర్

కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరును శివసేన తీవ్రంగా తప్పుబట్టింది. నెహ్రు-గాంధీ సృష్టించిన వ్యవస్థపై భారత్ మనుగడ సాగిస్తోందనేది స్పష్టమైందని ఆ పార్టీ ఆరోపించింది. 
 

Shiv Sena slams Centre over COVID-19 management, says India surviving on system created by Nehru, Gandhis
Author
Mumbai, First Published May 9, 2021, 10:12 AM IST

న్యూఢిల్లీ: కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరును శివసేన తీవ్రంగా తప్పుబట్టింది. నెహ్రు-గాంధీ సృష్టించిన వ్యవస్థపై భారత్ మనుగడ సాగిస్తోందనేది స్పష్టమైందని ఆ పార్టీ ఆరోపించింది. పాకిస్తాన్, రువాండా, కాంగో వంటి దేశాలు ఇతర దేశాల నుండి సహాయం పొందేవి. కానీ  ప్రస్తుత పాలకుల తప్పుడు విధానాల కారణంగా ఇండియా ఇతర దేశాల నుండి సహాయం పొందాల్సి వస్తోందని శివసేన తీవ్రంగా విమర్శించింది. శివసేన అధికార పత్రిక సామ్నాలో ఆ పార్టీ ఈ వ్యాఖ్యలు చేసింది. నెహ్రూ-గాంధీ సృష్టించిన వ్యవస్థపై భారతదేశం మనుగడ సాగిస్తోంది. చాలా పేద దేశాలు భారత్ కు సహాయం అందిస్తున్నాయి. అయితే ఇంతకుముందు  మాత్రం పాకిస్తాన్, రువాండా, కాంగో  లాంటి ఇతర దేశాలు భారత్ నుండి సహాయం పొందేవి. కానీ  నేటి పాలకుల తప్పుడు విధానాలతో భారత్ ఇప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కొంటుందని శివసేనను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ ప్రకటించింది. 

దేశంలో అభివృద్ది పనులను ,ప్రాజెక్టులను  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేపట్టాయని  ఆ సంపాదకీయంలో  శివసేన గుర్తు చేసింది. నెహ్రు, లాల్‌బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ల పేర్లను ఆ వ్యాసంలో శివసేన గుర్తు చేసింది. కరోనా నుండి దేశం బయటకు రావడానికి ప్రధాని చాలా కష్టపడాల్సిన అవసరం ఉందని శివసేన అభిప్రాయపడింది. రాజకీయేతర జాతీయత గురించి మోడీ ఆలోచించాల్సిన అవసరం ఉందని  ఆ పార్టీ ఆ వ్యాసంలో తెలిపింది. మహారాష్ట్ర సీఎం థాకరే తో ప్రధాని మోడీ ఫోన్ లో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనాను అరికట్టేందుకు ఠాక్రే సర్కార్ చేపట్టిన చర్యలను మోడీ ప్రశంసించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios