Srinagar: కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ పాలుపంచుకున్నారు. ప్ర‌స్తుతం జ‌మ్మూకాశ్మీర్ లో కొన‌సాగుతున్న భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఆయ‌న‌.. ఈ యాత్ర‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీపై ప్ర‌శంస‌లు కురిపించారు.  

Shiv Sena leader Sanjay Raut: 'నేను శివసేన వైపు నుంచి వచ్చాను. దేశ వాతావరణం మారుతోంది. కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ ప్ర‌జ‌ల కోసం తన స్వరం పెంచే నాయకుడిగా నేను చూస్తున్నాను. ఆయనకు మద్దతుగా జనాలు తరలివస్తున్నారు.. ప్రజలు ఆయ‌న‌తో క‌లిసి ముందుకు నడుస్తున్నారు అని భార‌త్ జోడో యాత్ర‌లో పాలుపంచుకున్న శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంలో దేశవ్యాప్త భార‌త్ జోడో యాత్ర ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం జ‌మ్మూకాశ్మీర్ లోకి అడుగుపెట్టి పాద‌యాత్ర‌లో పెద్దఎత్తున ప్ర‌జ‌లు నుంచి స్పంద‌న ల‌భిస్తోంది. వ‌ణికించే చ‌లిని సైతం లెక్క‌చేయ‌కుండా ఆయ‌న‌తో క‌లిసి ముందుకు న‌డుస్తున్నారు. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ పాలుపంచుకున్నారు. ప్ర‌స్తుతం జ‌మ్మూకాశ్మీర్ లో కొన‌సాగుతున్న భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఆయ‌న‌.. ఈ యాత్ర‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీపై ప్ర‌శంస‌లు కురిపించారు. ప్ర‌జ‌ల కోసం తన స్వరం పెంచే నాయకుడిగా రాహుల్ గాంధీని చూస్తున్నాన‌ని సంజ‌య్ రౌత్ అన్నారు.

Scroll to load tweet…

శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నాయకుడు సంజయ్ రౌత్ శుక్రవారం కాంగ్రెస్ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్‌లోని కథువా గుండా వెళుతుండగా అందులో పాలుపంచుకున్నారు. రాహుల్ గాంధీతో క‌లిసి ముందుకు న‌డిచారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మాట్లాడుతూ..దేశ వాతావరణంలో మార్పు వచ్చిందనీ, యాత్రకు సారథ్యం వహిస్తున్న రాహుల్ గాంధీని తాను గళం విప్పే నాయకుడిగా చూస్తున్నానని రౌత్ అన్నారు. "నేను శివసేన వైపు నుంచి వచ్చాను. దేశ వాతావరణం మారుతోంది, రాహుల్ గాంధీ తన స్వరం పెంచే నాయకుడిగా నేను చూస్తున్నాను. ఆయనకు మద్దతుగా జనాలు తరలివస్తున్నారు. ప్రజలు ఆయ‌న‌తో క‌లిసి న‌డుస్తున్నారు" అని సంజ‌య్ రౌత్ చెప్పిన‌ట్టు ఏఎన్ఐ నివేదించింది.

కాగా, ప్ర‌స్తుతం సంజ‌య్ రౌత్ జ‌మ్మూకాశ్మీర్ కు మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. కాశ్మీర్‌లో తమ సహచరులు-ఇతర మైనారిటీలను ఇటీవల లక్ష్యంగా చేసుకున్న హత్యలకు సంబంధించి తమను సురక్షిత ప్రదేశానికి తరలించాలని డిమాండ్ చేస్తూ 11 నెలలుగా నిరసనలు చేస్తున్న కాశ్మీరీ పండిట్ కమ్యూనిటీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. వారికి శివసేన నాయకుడు సంజ‌య్ రౌత్ సంఘీభావం తెలిపారు. తరువాత, ఆయ‌న పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని సిక్కు ప్రతినిధులతో సమావేశమై యూటీలో వారి మైనారిటీ హోదా కోసం డిమాండ్ చేశారు. 

అయితే, సంజ‌య్ రౌత్ చర్యను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ప్రత్యర్థి వర్గం విమర్శించింది. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే ఆశయాలకు వ్యతిరేకంగా రౌత్ పనిచేస్తున్నారని షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే శంభురాజ్ దేశాయ్ గతంలో అన్నారు. “బాలాసాహెబ్ థాకరే ఒకప్పుడు కాంగ్రెస్‌తో కలిసి వెళ్లనని చెప్పారు. కానీ నేడు, వారు (ఉద్ధవ్ వర్గానికి చెందిన సభ్యులు) ఆయన ఆదర్శానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. సంజయ్ రౌత్ బాలాసాహెబ్ ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అసలు శివసేన ఏది అనే దానిపై ఇక చర్చ లేదు” అని దేశాయ్ అన్నారు.

Scroll to load tweet…