Asianet News TeluguAsianet News Telugu

'బీజేపీ ఆత్మ చచ్చిపోయింది'.. యాకూబ్ మెమన్ సమాధి 'సుందరీకరణ' వివాదంపై సామ్నా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు 

ఇటీవల ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ సమాధిని సుందరీకరించారు. అతని సమాధికి రంగు రంగుల ఎల్ఈడీ లైట్లతో అలంకరించారు. దీనిపై ఈ వివాదం తెర మీద‌కు వ‌చ్చింది. రాజ‌కీయంగా తీవ్ర దూమారం రేగ‌డంతో ఆ లైట్లను తొలగించి పలువురిపై కేసులు నమోదు చేశారు. తాజాగా దీనిపై విచారణకు సీఎం ఆదేశించారు.కానీ ఇటీవ‌ల సామ్నా ప్ర‌తిక త‌న సంపాద‌కీయంలో తీవ్రంగా వ్య‌తిరేకించింది.  
 

Shiv Sena mouthpiece Saamana on Yakub Memon grave beautification row
Author
First Published Sep 12, 2022, 6:43 PM IST

1993 లో జ‌రిగిన‌ ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మీనన్ సమాధి సుందరీకరణపై వివాదం రేగుతోంది. ఇటీవల దోషి యాకూబ్ సమాధిని సుందరీకరించారు. అతని సమాధికి రంగు రంగుల ఎల్ఈడీ లైట్లతో అలంకరించారు. దీనిపై ఈ వివాదం తెర మీద‌కు వ‌చ్చింది. శివసేన నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో ఉగ్రవాద దోషి యాకూబ్ మెమన్ సమాధిని అందంగా తీర్చిదిద్దారని బీజేపీ ఆరోపించింది. ఈ ఆరోప‌ణ‌లకు సేన మౌత్ పీస్ సామ్నా తీవ్రంగా వ్య‌తిరేకించింది. ఈ క్ర‌మంలో సామ్నా సంపాదకీయంలో .. బీజేపీ ఆత్మ చచ్చిపోయిందని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది.  

పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ సమాధిని అందంగా తీర్చిదిద్దారని, శివసేన నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో ఆ స‌మాధిని పుణ్యక్షేత్రంగా మార్చేందుకు ప్రయత్నాలు జరిగాయని బీజేపీ ఆరోపించింది. ఈ ఆరోప‌ణ‌ల‌కు ప్ర‌తి కొద్ది రోజులకే.. సేన మౌత్ పీస్ సామ్నా తన ఎడిటోరియల్ కాలమ్‌లో బీజేపీ ఆత్మ చనిపోయిందని ప్ర‌త్యేక కథ‌నాన్ని రాసింది.

మహారాష్ట్రలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత శాంతియుతంగా ఉంటుందని అందరూ భావిస్తున్నారని సంపాదకీయం ప్రారంభించినా.. బీజేపీ ఆత్మ చచ్చిపోయింద‌నీ, దాని ఆ స్థానాన్ని రక్త పిశాచం ఆక్రమించింద‌ని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర‌ ప్రజల మనస్సులలో ఎలాంటి సందేహం లేదని రాసుకోచ్చింది. యాకూబ్ మెమన్ స‌మాధి సుంద‌రీక‌ర‌ణపై  దేవేంద్ర ఫడ్నవీస్‌ను రేవులో నిలబెట్టి 100 ప్రశ్నల వర్షం కురిపించవచ్చు, కానీ రాజకీయాల స్థాయిని దిగజార్చడం త‌మకు అసలు ఇష్టం లేదనీ సామ్నా ప‌త్రిక‌ పేర్కొంది.  

మహారాష్ట్రలోని ముంబై అల్లర్లు, బాంబు పేలుళ్లలో శివసేననే తీవ్రంగా గాయ‌ప‌డింద‌ని, ఈ విషయం మహారాష్ట్రకు తెలుసున‌నీ, అయితే.. ఆ సమయంలో ఈ హిందూత్వవాదులు ఎక్కడ దాక్కున్నారు? అని ప‌రోక్షంగా బీజేపీని ప్ర‌శ్నించింది.  అన్నింటిని కాపాడిన ఏకైక పార్టీ శివసేనన‌ని పేర్కొంది. యాకూబ్ మెమన్ సమాధి అలంకరణపై విచారణ జరుపుతామని ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రకటించారు. అలా ఉండనివ్వండి! ఆ విచారణను తాము స్వాగతిస్తున్నామని అని సామ్నా పేర్కొంది
 
శివసేన మద్దతుతో సమాధికి సుందరీకరణ జరిగిందని బీజేపీ ఆరోపిస్తోందని శివసేన పేర్కొంది. అయితే, ముఖ్యమైన అంశాలు బీజేపీ చర్చకు రాకుండా చేస్తుంద‌నీ, హిందూ-ముస్లిం, హిజాబ్, హిందూస్థాన్-పాకిస్థాన్ లాంటి పాత అంశాలే మళ్లీ లేవనెత్తడం వల్ల సమాజంలో ఉద్రిక్తతల‌ను సృష్టించాల‌ని బీజేపీ పన్నాగం ప‌న్నుతోంద‌ని సంపాదకీయంలో పేర్కొంది.

యాకూబ్‌ మెమన్‌ సమాధికి సంబంధించిన అంశం తెరపైకి వచ్చినప్పుడు శివసేన అధికారంలో ఉండి ఉంటే..  ఎవరైనా బీజేపీని నిందించి ఉంటే.. వారు వెంటనే నోరు మూసుకునేవారని, బీజేపీ- శివ‌సేన‌లు రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, కానీ, ఇలాంటి స‌మ‌యంలో శివ‌సేనని ఒంటరిగా చేయడం సరికాదు. ఏ పార్టీ కూడా దోషి స‌మాధి సుందరీకరణను ప్రశంసించలేదని సామ్నా త‌న‌ సంపాదకీయంలో పేర్కొన్నారు. 

అఫ్జల్ గురు మాదిరిగానే యాకూబ్ మెమన్‌ను కూడా ఉరితీసిన తర్వాత నాగ్‌పూర్ జైలులోనే దహనం చేసి ఉండాల్సిందని సంపాదకీయం పేర్కొంది. ఇలా సమాధి సమస్య తలెత్తకుండా ఉండేద‌నీ, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్ర‌భుత్వ‌మే.. యాకూబ్ మెమన్ మృతదేహాన్ని అతని కుటుంబానికి ఇచ్చారని సామ్నా ఆరోపించింది.

Follow Us:
Download App:
  • android
  • ios