ఒక మహిళ మృతికి కారణమంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట మంత్రి సంజయ్ రాథోడ్‌ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను సీఎం ఉద్దవ్ థాక్రేకు అందేజేశారు

ఒక మహిళ మృతికి కారణమంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట మంత్రి సంజయ్ రాథోడ్‌ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను సీఎం ఉద్దవ్ థాక్రేకు అందేజేశారు

అంతకు ముందు సంజయ్ వ్యవహారంపై స్పందించారు శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్. ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ బీజేపీ నేతలు చేస్తున్న డిమాండ్‌‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఒత్తిళ్లతో ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకోజాలరని స్పష్టం చేశారు. మంత్రివర్గంలో ఎవరిని ఉంచాలా, తొలగించాలా అనే దానిపై ముఖ్యమంత్రిదే నిర్ణయమని ఆయన తెలిపారు.

కాగా, ఈనెల 8న 23 ఏళ్ల పూజా చవాన్ అనే మహిళ భవంతి నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయింది. ఆత్మహత్య కోణం నుంచి ఈ కేసును పరిశీలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

ఆమె మరణానికి సంబంధించినవిగా చెబుతున్న కొన్ని ఆడియా క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి రాథోడ్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేయగా, ఆమె మరణంతో తనకెలాంటి సంబంధం లేదని సంజయ్ ఖండించారు.