షిర్డీ సాయిబాబా దేవాలయానికి రూ.175 కోట్ల పన్ను మినహాయింపు..
ఆదాయపు పన్ను శాఖ శ్రీ సాయిబాబా సంస్థాన్‌ను మతపరమైన, ధార్మిక ట్రస్ట్‌గా అంగీకరిస్తూ విరాళాలపై విధించే పన్ను నుండి మినహాయింపు మంజూరు చేసింది.

పూణె : షిర్డీలోని శ్రీ సాయిబాబా ఆలయ ట్రస్ట్‌కు భారీ పన్ను మినహాయింపు లభించింది. గత మూడేళ్లలో విధించిన రూ. 175 కోట్ల ఆదాయపు పన్ను చెల్లింపు నుంచి సాయిబాబా ఆలయ ట్రస్ట్‌కు మినహాయింపు లభించిందని అధికారులు శుక్రవారం తెలిపారు.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈ మినహాయింపును మంజూరు చేసినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపింది. "2015-16 సంవత్సరానికి పన్నును అంచనా వేసేటప్పుడు, ఆదాయపు పన్ను శాఖ శ్రీ సాయిబాబా సంస్థాన్ మతపరమైన ట్రస్ట్ కాదని, స్వచ్ఛంద ట్రస్ట్ అని భావించింది. ఈ మేరకు విరాళాల పెట్టెలో భక్తులు వేసిన విరాళాలపై 30 శాతం ఆదాయపు పన్ను విధించింది. దీని ప్రకారం పన్ను చెల్లింపును జారీ చేసింది. రూ.183 కోట్లకు నోటీసు ఇచ్చింది” అని పేర్కొంది.
దీంతో, ఆ తర్వాత ట్రస్ట్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను దాఖలు చేసింది, సుప్రీంకోర్టు దీనిని పరిశీలించి.. "పన్ను నిర్ణయించే వరకు చెల్లించాల్సిన పన్నుపై స్టే విధించింది" అని పేర్కొంది. శ్రీ సాయిబాబా సంస్థాన్‌ను మతపరమైన, ధార్మిక ట్రస్ట్‌గా అంగీకరించింది. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ చివరకు విరాళాల పెట్టెలో భక్తుు వేసిన విరాళంపై విధించిన పన్ను నుండి మినహాయింపును మంజూరు చేసింది. ఈ మేరకు శ్రీ సాయిబాబా సంస్థాన్‌కు గత మూడేళ్లలో విధించిన రూ.175 కోట్ల ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు లభించిందని తెలిపింది.
ప్రియుడు మాట్లాడడం లేదని విషం తాగుతూ సెల్ఫీ వీడియో.. చివరికి..