సోమవారం జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనాగల్‌లోని దాల్ సరస్సు దగ్గర జి20 ప్రతినిధులు షికారా రైడ్‌ను ఆస్వాదిస్తూ కనిపించారు.

జమ్మూ కాశ్మీర్‌ : సోమవారం జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని దాల్ సరస్సు వద్ద జి20 ప్రతినిధులు షికారా రైడ్‌ను ఆస్వాదిస్తూ కనిపించారు. కేంద్రపాలిత ప్రాంతం వేసవి రాజధాని శ్రీనగర్‌లో సోమవారం నుండి బుధవారం వరకు G20 కార్యవర్గ సమావేశం జరుగుతోంది. G20 సభ్య దేశాల నుంచి 60 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అంతేకాకుండా, G20 సమావేశం నేపథ్యంలో శ్రీనగర్ నగర్, షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (ఎస్ కెఐసిసి)కి వెళ్లే దారులు సుందరీకరణ చేశారు. 

3వ G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ (టీడబ్ల్యూజీ) సమావేశానికి హాజరయ్యేందుకు పలువురు విదేశీ ప్రతినిధులు శ్రీనగర్‌కు చేరుకున్నారు. వీరు సోమవారం దాల్ సరస్సులో షికారా రైడ్‌ను ఆస్వాదించారు. అనేక మంది అధికారులు సూర్యాస్తమయం సమయంలో దాల్ లేక్ విహరిస్తుండగా..వారి పడవకు అమర్చిన లైట్ల బంగారు కాంతులు నీటిలో ప్రతిబింబిస్తూ అద్భుత దృశ్యం ఆవిర్భవించింది.

రాహుల్ గాంధీకి హత్య బెదిరింపులు... గోరఖ్‌పూర్ యువకుడిపై కేసు నమోదు..

సహజ ప్రకృతి దృశ్యాలకు ముగ్థులైకేంద్రపాలిత ప్రాంతాన్ని ప్రశంసిస్తూ, జీ20 భారత్ ప్రతినిధి షెర్పా అమితాబ్ కాంత్ సినిమాలను చిత్రీకరణకు కాశ్మీర్ కంటే మెరుగైన ప్రదేశం లేదని అన్నారు.

"అనేక భారతీయ చిత్రాలను విదేశాలలో చిత్రీకరిస్తున్నట్లుగానే... ఇక్కడ కూడా భారీ సంఖ్యలో సినిమాల షూటింగ్ జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యటించిన నా అనుభవం ప్రకారం చాలా నిజాయితీగా చెప్పే విషయం ఏంటంటే.. సినిమా షూట్ చేయడానికి, రొమాన్స్ షూట్ చేయడానికి ప్రపంచంలో ఎక్కడైనా అత్యుత్తమ గమ్యస్థానం.. కాశ్మీర్ కంటే మెరుగైన ప్రదేశం మరేదీ లేదు" అని కాంత్ అన్నారు.

గ్లోబల్ టూరిజం ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోందని, త్వరలో జాతీయ పర్యాటక విధానాన్ని ప్రకటిస్తామని విదేశీ ప్రతినిధులతో కలిసి వచ్చిన పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రకటించారని పిటిఐ నివేదించింది. జమ్మూ కాశ్మీర్‌లో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి విపరీతమైన అవకాశాలు ఉన్నాయని, పర్యాటక రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డిఐ) కేంద్రం అనుమతిస్తోందని మంత్రి తెలిపారు.

Scroll to load tweet…