కాంగ్రెస్ పార్టీ జాతీయ‌ అధ్యక్ష ఎన్నిక నామినేషన్‌ను ఉపసంహరించుకున్నాడ‌నే వదంతులపై ఆ పార్టీ సీనియ‌ర్ నేత స్పందించారు. అవన్ని అవాస్తవమని శశిథరూర్ అన్నారు.

వందేళ్లకు పైగా ఘ‌న చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడుగా ఎవరు ఎన్నుకోబ‌డుతార‌నే చర్చ జరుగుతోంది. మరో రెండేళ్లలో సార్వ‌త్రిక‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపికయ్యే వ్యక్తి .. ఆ పార్టీని ముందుండి విజయపథంలో ప‌రుగులుదీయాల్సి వ‌స్తుంది. ఈ గురుత‌ర బాధ్య‌త‌ల నుంచి ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ త‌ప్ప‌కోవ‌డంతో ఎన్నిక‌లు అనివార్యం అయ్యాయి. ఈ త‌రుణంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బ‌రిలో పార్టీ సీనియ‌ర్ నేత‌లు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ లు బ‌రిలో నిలిచారు. అయితే.. ఈ ఎన్నికల నుంచి శ‌శిథ‌రూర్ త‌న‌ నామినేషన్‌ను ఉపసంహరించుకోవచ్చని, ఆయ‌న ఈ ఎన్నిక‌ల్లో ఎలాంటి ప్ర‌చారం చేయ‌కుండా దూరంగా ఉండ‌బోతున్నడ‌నే ఊహాగానాలు వస్తున్నాయి. 

వీటిపై శ‌శిథ‌రూర్ స్వ‌యంగా స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను విడుదల చేశాడు. ఈ యుద్ధంలో చివ‌రి వ‌ర‌కు పోరాడతానని, నామినేషన్ వెనక్కి తీసుకోనని స్పష్టం చేశాడు. తన నామినేషన్‌ ఉపసంహరణపై ఢిల్లీ వర్గాలను ఉటంకిస్తూ వస్తున్న వార్తలు కేవలం పుకార్లేనని అన్నారు. పార్టీ అధ్యక్ష పదవికి మల్లికార్జున్ ఖర్గేపై పోటీ చేస్తున్న తిరువనంతపురం ఎంపీ మాట్లాడుతూ.. "నేను తాను సవాల్‌కు సిగ్గుపడననీ, త‌న జీవితంలో ఎప్పుడూ ఇలా చేయలేదనీ, భ‌విష్య‌త్తులో కూడా చేయనని అన్నారు. ఇది పోరాటం.. పార్టీలో స్నేహపూర్వక పోటీ. చివరి వరకు పోరాడతానని పేర్కొన్నారు.

అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక‌ల పోరులో పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ శశిథరూర్‌తో ఎన్నికల పోరులో తలపడనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శశిథరూర్ నాగ్‌పూర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. దీంతో పాటు తన సొంత రాష్ట్రాలైన కేరళ, తెలంగాణ, తమిళనాడులను కూడా సందర్శించారు. ముమ్మరంగా ప్రచారంలో బిజీగా ఉన్నారు.

కాంగ్రెస్ అధినేత‌ ఎన్నికలో వీరిద్దరు మాత్రమే బ‌రిలో ఉన్నారు. కెఎన్ త్రిపాఠి త‌న నామినేషన్ ను ఇప్పటికే రద్దు చేసుకున్నారు. అయితే శశి థరూర్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోబోనని ఇప్పటికే ప్రకటించారు. తాను త‌న‌ని న‌మ్ముకున్న జ‌ కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేయను అని శశిథరూర్ అన్నారు.

Scroll to load tweet…