Asianet News TeluguAsianet News Telugu

'నేను ఎవరికీ భయపడను, నాకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు' 

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మంగళవారం కేరళలో పర్యటిస్తున్నారు. పానక్కడ్‌లో యుడిఎఫ్-మిత్రపక్ష ఐయుఎంఎల్ సీనియర్ నాయకులను కలిశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..  తాను ఎవరికీ భయపడనని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Shashi Tharoor Malabar Tour Dont Fear Anyone, No One Needs To Fear Me
Author
First Published Nov 22, 2022, 2:08 PM IST

కాంగ్రెస్ నేత,ఎంపీ శశిథరూర్ తన కేరళ పర్యటనలో సంచలన ప్రకటన చేశారు. తాను ఎవరికీ భయపడనని, తనని చూసి ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ పర్యటనలో ఆయన పానక్కడ్‌లో యుడిఎఫ్‌-మిత్రపక్ష ఐయుఎంఎల్‌ సీనియర్‌ నేతలతోనూ సమావేశమయ్యారు. ఆ భేటీతో రాజకీయంగా పలు ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  తన కేరళ పర్యటనకు ఎవరు భయపడుతున్నారని అన్నారు. తాను ఎవరికీ భయపడనని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ఎంపీ అన్నారు. 

థరూర్ ప్రకటన ప్రత్యేకం

థరూర్ ప్రకటన, తంగల్‌తో అతని సమావేశం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కేరళలో ఆయనకు పెరుగుతున్న మద్దతుతో, పార్టీలో థరూర్ వర్గం ఆవిర్భవించే అవకాశం రాష్ట్రంలో వ్యక్తమవుతోంది. అయితే, థరూర్ అలా నమ్మడం లేదు. సాదిక్ అలీ షిహాబ్ తంగల్ నివాసంలో IUML నాయకులతో తన సమావేశం మర్యాదపూర్వకంగా జరిగినట్లు ఆయన అభివర్ణించారు. అక్కడ ఉన్న ఇతర సీనియర్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) నాయకులతో భేటీ కానున్నారు. దీంతో ఆయన పర్యటన అసాధారణమైనది కాదని పలువురు ఆరోపిస్తున్నారు. 
 
ఫ్యాక్షనిజంపై ఆసక్తి లేదు

తిరువనంతపురం ఎంపీతో పాటు ఎంపీ ఎంకే రాఘవన్ కూడా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ థరూర్‌కు ఫ్యాక్షనిజంపై నమ్మకం లేదా ఆసక్తి లేదని అన్నారు. కొందరు దీన్ని తమ విభజన వ్యూహంగా చెబుతున్నప్పటికీ, తమకి ఎలాంటి ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో లేదా ఆసక్తిగా లేమని, అదే వాస్తవమని అన్నారు. కాంగ్రెస్‌లో ఇప్పటికే 'ఎ', 'ఐ' వర్గాలు నిండిపోయిందని, ఇప్పుడు మరో  కొత్త వర్గాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. అటువంటి పరిస్థితులు ఏర్పడితే..అది U అంటే యునైటెడ్. కాంగ్రెస్‌తో సహా మనందరికీ ఇది చాలా అవసరమని అన్నారు. 

థరూర్-తంగల్ సమావేశం

దేశంలో విభజన రాజకీయాలు చురుగ్గా సాగుతున్న తరుణంలో అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే రాజకీయాలు అవసరమని బీజేపీ పేరును ప్రస్తావించకుండా థరూర్ విమర్శలు గుప్పించారు.
IUML ఇటీవల చెన్నై, బెంగళూరు మరియు ముంబైలలో సోదరభావాన్ని ప్రోత్సహించడానికి కార్యక్రమాలను నిర్వహించింది. థరూర్‌ను కలిసిన అనంతరం సాదిక్ అలీ షిహాబ్ తంగల్ మాట్లాడుతూ.. థరూర్‌తో తనకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. థరూర్ అన్ని ముఖ్యమైన ఈవెంట్‌లు, సందర్భాలకు ఆహ్వానిస్తారని అన్నారు.కాబట్టే నేడు అతను  మమ్మల్ని పలుకరించడానికి వచ్చాడని పేర్కొన్నారు.

కేరళ రాజకీయాల్లో థరూర్ యాక్టివ్

కేరళ రాజకీయాల్లో థరూర్ యాక్టివ్ కావాలని కోరుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు.. అతను ఇప్పటికే చాలా చురుకుగా ఉన్నాడని తంగల్ చెప్పారు. ఆయన కేరళకు చెందిన ఎంపీ. థరూర్ ఒక్క తిరువనంతపురంకే పరిమితం కాలేదు. ఆయన మంచి నాయకుడు. అయితే.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎల్‌డిఎఫ్‌ని పడగొట్టాలని, వివిధ కార్యక్రమాల ద్వారా థరూర్ తనను తాను సిఎంగా చూపించాలని ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌లోని వ్యతిరేక నాయకులు భావిస్తున్నారని ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios