Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ అధ్య‌క్ష బ‌రిలో శశి థరూర్ .. పార్టీ అధినేత్రి పచ్చ జెండా!

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు స‌మీస్తున్న త‌రుణంలో పార్టీ సీనియర్ నేత శశి థరూర్.. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తో భేటీ అయ్యారు. ఆయ‌న‌ అధ్యక్ష పదవి రేసులో దిగేందుకు సోనియా గాంధీ అనుమతి కోర‌గా.. అందుకు ఆమె గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు పార్టీ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్  పార్టీ సారథ్య బాధ్యతల్ని మ‌ళ్లీ రాహుల్ గాంధే చేపట్టాలంటూ పలు రాష్ట్రాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తున్నాయి.  

Shashi Tharoor gets Sonia Gandhi's nod to contest Congress president election: Sources
Author
First Published Sep 20, 2022, 12:08 AM IST

కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో పార్టీలో కీల‌క మార్పులు జ‌రుగుతున్నాయి. సీనియ‌ర్ నేత రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర పేరిట.. క‌న్యాకుమారి నుంచి కాశ్మీర్ వ‌ర‌కు సుధీర్ఘ పాద‌యాత్ర చేస్తుంటే.. మ‌రో వైపు హ‌స్తీనా లో కీల‌క భేటీలు జ‌రుగుతున్నాయి. తాజాగా.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో  సోమ‌వారం ఆ పార్టీ సీనియర్ నేత,  కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ కీల‌క భేటీ అయ్యారు. ఈ స‌మ‌యంలో అధ్య‌క్ష పోరులో దిగేందుకు పార్టీ అధినేత్రి నుంచి అనుమ‌తి కోరగా.. అందుకు అధినేత్రి సోనియా గాంధీ కూడా అంగీక‌రించిన‌ట్లు పార్టీ వ‌ర్గాల స‌మాచారం.

కాంగ్రెస్ పార్టీలో కీల‌క సంస్కరణలు తీసుక‌రావాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని శశి థరూర్‌ బహిరంగ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే సోనియాతో సమావేశం కావ‌డం మ‌రింత చర్చ‌నీయంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో సంస్క‌ర‌ణ‌లు తీసుక‌రావాలిని కోరుకుంటున్న వారిలో థరూర్ కూడా ఉండటం గమనార్హం. మ‌రోవైపు.. పార్టీ సీనియ‌ర్ నేత‌, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా అధ్యక్ష రేసులో ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఆయ‌న గాంధీ కుటుంబానికి అనుకులంగా.. సోనియా గాంధీ మ‌ద్ద‌తుతో బ‌రిలో దిగుతున్న‌ట్టు తెలుస్తుంది. 

ఈ ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తే.. అశోక్ గెహ్లాట్, శశిథరూర్ మధ్య అధ్య‌క్ష పోరు సాగ‌నున్న‌ట్టు విశ్వసనీయ సమాచారం. పార్టీ అధ్యక్ష ఎన్నిక‌ల నామినేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 30 వరకు కొనసాగనుంది. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లయితే, అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే, గెహ్లాట్‌, థరూర్‌ల మధ్య ఎన్నికలు జరిగి..  వారిలో ఒకరు కాంగ్రెస్ పార్టీ సార‌థ్య బాధ్య‌త‌లు స్వీక‌రిస్తే.. పార్టీ కష్టాలు తీరతాయా?   పార్టీకి పూర్వ వైభ‌వం తీసుక‌రాగ‌ల‌రా? అనేది. ప్రస్తుతం ఉన్న అతి పెద్ద ప్రశ్న. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అలా అనిపించడం లేదు.   గాంధీ కుటుంబం తప్ప మరే ఇతర స‌భ్యుడు .. పార్టీ సార‌థ్య బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించకూడ‌ద‌నే రేంజ్ లో ప్ర‌తిపాద‌న‌లు జ‌రుగుతున్నాయి. అయితే గాంధీ కుటుంబానికి చెందిన వారెవరూ ఈ పీఠాన్ని అధిష్టించబోరని రాహుల్ ఇప్పటికే స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. ప‌లు రాష్ట్రాల పార్టీ యూనిట్లు రాహుల్ గాంధీ పేరును అధ్యక్ష పదవికి ప్రతిపాదించాయి.
రాహుల్‌ గాంధీకే  మ‌రో సార్టీ  పార్టీ ప‌గ్గాలు అప్ప‌జేప్ప‌లంటూ ఇప్పటికే రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌ వంటి రాష్ట్రాల పీసీసీలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేశాయి. తాజాగా.. తమిళనాడు, మహారాష్ట్రల్లోని పీసీసీలు తీర్మానం చేశాయి. సోమవారం జరిగిన తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ బాధ్యతలు చేపట్టాలంటూ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి తీర్మానం ప్రవేశపెట్టగా.. అంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టు టీఎన్‌సీసీ ట్విటర్‌లో వెల్లడించింది.తొలుత రాజస్థాన్‌ పీసీసీ మద్దతుగా రాహుల్ సారథ్యానికే జై కొడుతున్నాయి.  జమ్మూకశ్మీర్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలు తీర్మానం చేసింది.  

ఇలాంటి పరిస్థితుల్లో గెహ్లాట్ లేదా థరూర్ అధ్యక్షుడైతే విడిపోయిన పార్టీని ఏకతాటిపైకి తీసుకురావ‌డం.. అధ్య‌క్షుడికి ముందున్న  అతిపెద్ద‌ సవాలు. సోనియా లేదా రాహుల్ అధ్యక్షురాలు కాకపోయినా, గాంధీ కుటుంబం ఎప్పుడూ గొప్ప అధికార కేంద్రంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త అధ్యక్షుడికి, గాంధీ కుటుంబానికి మధ్య సమీకరణాలు ఏ విధంగా మారుతాయో వేచిచూడాలి.

మ‌రోవైపు.. గెహ్లాట్, థరూర్‌ల్లో అధ్యక్ష పదవికి ఎన్నికైతే పార్టీకి మేలు జరుగుతుందని పలువురు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. బిజెపిని పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ అని పిలవడం ద్వారా కాంగ్రెస్‌పై దాడి చేయవచ్చు. ఎందుకంటే బిజెపి తరచుగా కాంగ్రెస్‌ను కుటుంబ వాదం అని ఆరోపిస్తూనే ఉంది. గాంధీ కుటుంబానికి వెలుపల ఉన్న అధ్యక్షుడు కూడా కుటుంబ వాద ఆరోపణలకు ధీటైన సమాధానం చెప్ప వ‌చ్చ‌ని భావిస్తున్నారు. మొత్తంమీద  రాబోయే కొద్ది రోజులు..  దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ప‌లు  ఉత్కంఠభరితమైన‌, కీల‌క‌ పరిణామాలు జ‌ర‌గ‌బోతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios