Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్కర్ స్కాం.. శరత్ చంద్రారెడ్డికి మధ్యంతర బెయిల్, కండీషన్స్ అప్లయ్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అభియోగాలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డికి మధ్యంతర బెయిల్ లభించింది. తన భార్యకు ఆరోగ్యం సరిగా లేదని, చికిత్స చేయించాల్సిన అవసరం వుందంటూ ఆయన బెయిల్ పిటిషన్‌ దాఖలు చేశారు.

sharat chandra reddy gets interim bail in delhi liquor scam
Author
First Published Apr 1, 2023, 9:20 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అభియోగాలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డికి బెయిల్ లభించింది. ఈ మేరకు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్ట్ శనివారం ఆదేశాలు జారీ చేసింది. తన భార్యకు ఆరోగ్యం సరిగా లేదని, చికిత్స చేయించాల్సిన అవసరం వుందంటూ ఆయన బెయిల్ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. మానవతా దృక్పథంతో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే పూచీకత్తుతో పాటు కొన్ని కండీషన్స్ కూడా న్యాయస్థానం విధించినట్లుగా తెలుస్తోంది. 

ఈ ఏడాది జనవరిలోనూ శరత్ చంద్రారెడ్డికి కోర్ట్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తన నానమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు  బెయిల్ మంజూరు చేయాలని శరత్ చంద్రారెడ్డి  కోర్టులో పిటిషన్ దాఖలు  చేశారు. దీంతో ఆయనకు జనవరి 27న  14 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది  కోర్టు . 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు కొన్ని కండీషన్స్ కూడా పెట్టింది. ఈ గడువు ముగిసిన తర్వాత ఆయన తిరిగి లొంగిపోయారు.

Also REad: ఢిల్లీ లిక్కర్ స్కాం.. మనీష్ సిసోడియాకు చుక్కెదురు, బెయిల్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం

2022 నవంబర్  09వ తేదీన  శరత్ చంద్రారెడ్డిని  ఈడీ అధికారులు అరెస్ట్  చేసిని సంగతి తెలిసిందే. శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను  మూడు రోజుల పాటు విచారించిన ఈడీ అధికారులు  వారిని  ఒకే రోజున అరెస్ట్  చేశారు. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థకు శరత్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. ఈ సంస్థతో పాటు  పలు  సంస్థల్లో  శరత్ చంద్రారెడ్డికి  భాగస్వామ్యం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఆయన సౌత్ గ్రూప్‌కు ప్రతినిధిగా వున్నారు.

ఈ కుంభకోణానికి సంబంధించి హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్ కేంద్రంగా నగదు బదిలీ అయినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు దర్యాప్తు అధికారులు. ప్రైవేట్ జెట్ విమానాల ద్వారా నగదు తరలించినట్లుగా అభిప్రాయపడుతున్నారు. శరత్ చంద్రారెడ్డి భార్య నడుపుతోన్న కనికా టెక్రివాల్ సంస్థ ద్వారా లావాదేవీలు జరిగినట్లుగా భావిస్తున్నారు. జెట్ సెట్ గో సంస్థ ద్వారా డబ్బులు బదిలీ అయినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం జెట్ సెట్ గో సంస్థ సీఈవోగా శరత్ చంద్రారెడ్డి భార్య పనిచేస్తున్నారు. దీనిపై ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఈడీ వివరాలు కోరింది.  

Follow Us:
Download App:
  • android
  • ios