ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ తన రాజీనామాను వెనక్కు తీసుకన్నారు. కార్యకర్తల ఒత్తిడి మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ముంబై: ఎన్సీపీ చీఫ్ పదవికి చేసిన రాజీనామాను శరదపవార్ శుక్రవారం నాడు వెనక్కు తీసుకున్నారు. మీ మనోభావాలను అగౌరవపర్చలేనని శరద్ పవార్ చెప్పార. మీరు చేసిన వినతి, మీరు చూపిన ప్రేమ కారణంగా రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టుగా శరద్ పవార్ ప్రకటించారు. ఎన్‌సీపీ సీనియర్ నేతలు ప్రతిపాదించిన తీర్మానాన్ని తాను ఆమోదిస్తున్నట్టుగా శరద్ పవార్ ప్రకటించారు. తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్టుగా ఆయన తెలిపారు.
మూడు రోజుల క్రితం ఎన్సీపీ చీప్ పదవికి శరద్ పవార్ రాజీనామా చేశారు. ఈ రాజీనామాను పార్టీ నేతలు వ్యతిరేకించారు. ఎన్సీపీ కోర్ కమిటీ కూడా శరద్ పవార్ రాజీనామాను తిరస్కరించింది. దీంతో శరద్ పవార్ తన రాజీనామాను వెనక్కు తీసుకున్నారు. శరద్ పవార్ తన రాజీనామాను వెనక్కు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
రాజీనామాపై పునరాలోచన చేయాలని నేతలు కోరారు. ఈ విషయమై పార్టీ నేతల నుండి వచ్చిన వినతి మేరకు శరద్ పవార్ ఇవాళ సాయంత్రం తన రాజీనామాను వెనక్కు తీసుకున్నారు.
మూడు రోజుల క్రితం శరద్ పవార్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయం ఎన్‌సీపీ వర్గాలను షాక్ కు గురి చేసింది. ఎన్‌సీపీ అధ్యక్షపదవికి శరద్ పవార్ చేసిన రాజీనామాను తిరస్కరించింది ఎన్‌సీపీ కోర్ కమిటీ.
ఎన్‌సీపీలో కొందరు ఎమ్మెల్యేలతో కలిసి అజిత్ పవార్ బీజేపీలో చేరుతారని ఇటీవల కాలంలో ప్రచారం సాగింది. అయితే శరద్ పవార్ బతికున్నంత కాలం తాను పార్టీని వీడనని కూడా అజిత్ పవార్ ఇటీవల తేల్చి చెప్పారు.ఈ పరిణామాల నేపథ్యంలో శరద్ పవార్ ఎన్‌సీపీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు.
మరో వైపు ఎన్‌సీపీ చీఫ్ పదవిని సుప్రియా సూలేకు శరద్ పవార్ కట్టబెడుతారనే ప్రచారం కూడా అజిత్ పవార్ బీజేపీలో చేరుతారనే ప్రచారానికి కారణంగా మారిందనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు
పార్టీలో సంస్థాగత మార్పులు చేయనున్నట్టుగా శరద్ పవార్ ప్రకటించారు. కొత్త నాయకత్వాన్ని, కొత్త బాధ్యతలు సృష్టించడం కోసం తాను కృషి చేస్తానని పవార్ ప్రకటించారు. మరో వైపు ఎన్ సీపీ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్టుగా శరద్ పవార్ ప్రకటించారు. 2024లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని శరద్ పవార్ మరోసారి ప్రకటించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఫోన్ చేసి తనను అధ్యక్ష పదవిలో కొనసాగాలని కోరారని ఆయన చెప్పారు.
