Asianet News TeluguAsianet News Telugu

శరద్ పవార్‌తో మోడీ భేటీ.. 50 నిమిషాల పాటు మంతనాలు, ఢిల్లీలో ఏం జరుగుతోంది

ప్రధాని నరేంద్రమోడీ, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌తో శనివారం సమావేశమయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీ దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగింది. వారి సమావేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ధ్రువీకరించింది.

sharad pawar meets pm modi in delhi ksp
Author
New Delhi, First Published Jul 17, 2021, 2:53 PM IST

దేశ రాజకీయాల్లో గత కొన్నిరోజులుగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రశాంత్ కిశోర్ మూడో కూటమిని తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పార్టీల నేతలను కలిసిన ఆయన దీనిపై చర్చలు జరుపుతున్నారు. అటు కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అయిన పీకే... కొన్ని సలహాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌తో శనివారం సమావేశమయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీ దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగింది. వారి సమావేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ధ్రువీకరించింది. ఈ మేరకు  ‘రాజ్యసభ ఎంపీ శరద్ పవార్ ప్రధాని మోడీని కలుసుకున్నారు’ అంటూ ట్వీట్ చేసింది. అయితే వీరి భేటీకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.  

ALso REad:మిషన్ 2024: ముచ్చటగా మూడోసారి పీకే- పవార్ భేటీ, థర్డ్ ఫ్రంట్ తప్పదా..?

ఇదిలా ఉండగా.. శరద్ పవార్ వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలుస్తారంటూ గత కొద్దికాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే విపక్ష పార్టీల అభ్యర్థిగా బరిలో దిగుతారంటూ వచ్చిన వార్తలను పవార్ తోసిపుచ్చారు. ‘అధికార పార్టీకి 300 మందికి పైగా ఎంపీలున్నారు. ఫలితం ఎలా ఉంటుందో నాకు తెలుసునని.. అవన్నీ ఊహాగానాలే’ అంటూ పవార్ ఖండించారు. ఇలాంటి పరిస్ధితుల్లో ప్రధానితో పవార్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios