కృష్ణగిరి: అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు భర్త.ఈ ఘటన సూళగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

విళుపురం జిల్లా శంకరాపురం సమీపంలోని మరిది గ్రామానికి చెందిన ఇళయరాజ, శాంతిని వివాహం చేసుకొన్నాడు.  వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఉద్యోగం కోసం భార్యాభర్తలు  15 రోజుల క్రితం సూళగిరికి వచ్చారు. సూళగిరి దిగువపేటలోనే ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు.

శుక్రవారం రాత్రి ఇళయరాజ భార్య శాంతిని హత్య చేసి కిటికీకి ఆమెను ఉరి వేసి పారిపోయాడు.  శనివారం నాడు ఈ విషయాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనస్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఇళయరాజా కోసం  గాలింపు చర్యలు చేపట్టారు.భార్య హత్యకు గురికావడం,  భర్త పారిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.