ఓ మహిళపై దాదాపు మూడు దశాబ్దాల కిందట అత్యాచారం జరిగింది. ఆమె సోదరులే ఈ దారుణానికి ఓడిగట్టారు. దీంతో ఆమె ఓ మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయితే దాదాపు 27 ఏళ్ల తర్వాత నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. మహిళ తన కొడుకు ప్రోత్సహంతో న్యాయ పోరాటం కొనసాగించింది.  

ఓ మహిళపై దాదాపు మూడు దశాబ్దాల కిందట అత్యాచారం జరిగింది. ఆమె సోదరులే ఈ దారుణానికి ఓడిగట్టారు. దీంతో ఆమె ఓ మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డను వేరే వ్యక్తులకు దత్తత ఇచ్చింది. అయితే 27 ఏళ్ల తర్వాత అసలు విషయం తెలుసుకున్న మహిళ కొడుకు ఆమె వద్దకు చేరుకున్నాడు. తన తల్లితో కలిసి న్యాయ పోరాటానికి దిగాడు. ఈ క్రమంలోనే మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఒకరిని పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. వివరాలు.. ఈ ఘటన 1994లో జరిగింది. బాధిత మహిళ 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ఇద్దరు సోదరులు మహమ్మద్ రజీ, నకీ హసన్‌లు ఆమెపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

పలుమార్లు అత్యాచారం జరపడంతో మహిళ గర్భం దాల్చింది. దీంతో నిందితులు ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసుల కేసు పెట్టవద్దని బెదిరింపులకు పాల్పడ్డారు. ఆమెకు పుట్టిన బిడ్డను ఎవరికైనా దత్తత ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలోనే బాధిత మహిళ తనకు పుట్టిను కొడుకును వేరేవారికి దత్తత ఇచ్చింది. అయితే దాదాపు 27 ఏళ్ల తర్వాత నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. ఎక్కడో ఉన్న మహిళ కొడుకు ఆమె వద్దకు చేరుకున్నాడు. ఆమెకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసేలా ప్రోత్సహించాడు. 

ఈ క్రమంలోనే బాధిత మహిళ కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. నిందితులు బాధిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారని నిర్దారించుకున్న తర్వాత.. వారిని అరెస్ట్ చేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే నిందితుల్లో ఒకరైన ఏళ్ల మహమ్మద్ రజీని మంగళవారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. మరో నిందితుడు నకీ హసన్ ఒడిశాలో ఎక్కడో తలదాచుకున్నాడని.. త్వరలోనే అతడిని పట్టుకుంటామని షాజహాన్‌పూర్ పోలీసులు తెలిపారు. ఇన్నేళ్ల తర్వాత కేసు తెరవబడుతుందని ఊహించలేదని రజీ అంగీకరించినట్టుగా విచారణలో భాగమైన పోలీసు అధికారులు తెలిపారు. 

ఈ ఘటనపై షాజహాన్‌పూర్ ఎస్‌ఎస్‌పీ ఆనంద్ మాట్లాడుతూ.. “కోర్టు ఆదేశాల మేరకు 2021 మార్చి 4న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత నేరం నా దృష్టికి వచ్చింది. నిందితుల పూర్తి పేర్లు మా వద్ద లేవు. వారు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. ఇది చాలా పాత కేసు అయినప్పటికీ ఫిర్యాదులో వాస్తవం ఉంది. చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడ్డ మహిళకు న్యాయం జరిగేలా సహాయం చేయాలనుకున్నాం. విస్తృతమైన ఫాలో-అప్ తర్వాత.. మేము నిందితులుగా ఉన్న మహిళ సోదరులను గుర్తించగలిగాం. వారు నగరంలోని హడాఫ్ ప్రాంతంలో నివసిస్తున్నారని కనుగొన్నాము.

పోలీసులు నిందితులను సంప్రదించగా బాధిత మహిళ ఎవరో వారికి తెలియదని చెప్పారు. దీంతో డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. 2021 జూలైలో నమూనాలను ల్యాబ్‌కు పంపారు. 2022 ఏప్రిల్‌లో ఫలితాలు సానుకూలంగా వచ్చాయి. బాధిత మహిళకు జన్మించిన కొడుకుకు రాజీ జీవసంబంధమైన తండ్రి అని నిర్ధారించారు. సోదరులను అరెస్టు చేయడానికి పోలీసులు కోర్టు నుండి వారెంట్ పొందారు. అయితే అప్పటికే వారిద్దరు పారిపోయారు. 

దీంతో మేము నిందితుల ఆచూకీ కనుగోనడానికి అనేక బృందాలను నియమించాం. పరారీలో ఉన్న సోదరుల కోసం వెతకడానికి వారిని వివిధ ప్రదేశాలకు పంపాము. ఇద్దరు వ్యక్తుల స్థానాలను కనుగొనడంలో నిఘా బృందం చాలా కీలకంగా వ్యవహరించింది. ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఘటన.. అందుకే విచారణ అనేది అంత తేలికైన పని కాదు’’ అని చెప్పారు.