Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద కేసు...విద్యార్థిని అరెస్ట్

ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లారంటూ విద్యార్థిని కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. మొత్తం మీద చిన్మయానంద కేసుతో పాటు  బాధితురాలు డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిందనే మరో కేసు నమోదు కావడంతో ఈ కేసు మలుపు తిరిగింది.

Shahjahanpur Law Student Who Accused Chinmayanand of Rape Sent to Jail in Extortion Case
Author
Hyderabad, First Published Sep 25, 2019, 12:35 PM IST

కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద లైంగిక వేదింపుల కేసులో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. చిన్మయానంద తనను లైంగికంగా వేధించాడంటూ ఇటీవల ఓ విద్యార్థిని ఆరోపించిన సంగతి తెలిసిందే.  కాగా... ఆయనపై ఆరోపణలు చేసిన విద్యార్థినిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం విచారణకు అదుపులోకి తీసుకున్న పోలీసులు... బుధవారం ఉదయం ఆమెను అరెస్టు చేశారు.

తాను కాలేజీలోని హాస్టల్ లో తాను స్నానం చేస్తుండగా తనను చిన్మయానంద్ ఫోన్ లో రికార్డు చేస్తున్నారని, ఆ వీడియోని చూపించి తనపై పలుమార్లు లైంగికంగా దాడికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. కాగా ఆమె చేసిన ఆరోపణల ఆధారంగా రెండు రోజుల క్రితం చిన్మయానందను అరెస్టు చేశారు. ఇదిలావుండగా అత్యాచారం కేసులో బాధితురాలైన న్యాయ విద్యార్థిని డబ్బులు గుంజేందుకు బ్లాక్ మెయిల్ చేస్తుందనే ఫిర్యాదు మేర సిట్ ఆమెపై కూడా కేసు నమోదు చేసి బాధితురాలిని అరెస్టు చేసింది. 

ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లారంటూ విద్యార్థిని కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. మొత్తం మీద చిన్మయానంద కేసుతో పాటు  బాధితురాలు డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిందనే మరో కేసు నమోదు కావడంతో ఈ కేసు మలుపు తిరిగింది.

అత్యాచారం కేసులో బాధితురాలైన తనకు బ్లాక్ మెయిల్ కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ న్యాయవిద్యార్థిని కోర్టును ఆశ్రయించింది. దీనిపై కోర్టు గురువారం దర్యాప్తు చేయనుండగా... బుధవారం సిట్ ఆమెను అరెస్టు చేసింది. ఈ విషయంలో సిట్ బృందం...విద్యార్థినిని విచారించనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios