న్యూఢిల్లీలోని షాహీన్‌బాగ్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సీపీఎం దాఖలు చేసిన పిటిషన్ ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బాధితులు హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.


న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సీపీఎం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం నాడు తిరస్కరించింది. దక్షిణ న్యూఢిల్లీలోని Shaheen Bagh వద్ద అక్రమ కూల్చివేతలపై CPM నేతలు Supreme Courtలో సోమవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు.

దక్షిణ ఢిల్లీ మున్సిఫల్ కార్పొరేషన్ షాహీన్ బాగ్ సహా ఇతర ప్రాంతాలలో కూల్చివేతలకు వ్యతిరేకంగా సిపిఎం చేసిన పిటిషన్‌ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కోర్టును ఆశ్రయించింది రాజకీయ పార్టీ అని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించాలని బాధితులు, పిటిషనర్లకు సుప్రీంకోర్టు సూచించింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కోర్టును రాజకీయాలకు వేదిక చేయవద్దని కూడా సుప్రీంకోర్టు సూచించింది. 

New Delhi లోని పలు ప్రాంతాల్లో అక్రమ demolition ను కూల్చివేయాలని ఢిల్లీ కార్పోరేషన్ నిర్ణయం తీసుకొంది. ఇందులో భాగంగా గత మాసంలో జహంగీర్‌పురి వద్ద అక్రమ కట్టడాల కూల్చివేతలను చేపట్టారు. ఇవాళ ఉదయం నుండి షాహీన్ బాగ్ వద్ద అక్రమ కట్టడాల కూల్చివేతను చేపట్టింది దక్షిణ డిల్లీ మున్సిపల్ కార్పోరేషన్. ఇవాళ ఉదయం బుల్‌డొజర్లతో అక్రమ నిర్మాణాల కూల్చివేతను మున్సిపల్ అధికారులు ప్రారంభించారు. అయితే ఈ కూల్చివేతను నిరసిస్తూ పెద్ద ఎత్తున స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో పారా మిలటరీ బలగాలను కూడా రంగంలోకి దించారు. ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో కూల్చివేత ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ విషయమై సీపీఎం నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాము ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టలేదని స్థానికులు ఓ జాతీయ మీడియా చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

షాహీన్‌బాగ్ రోడ్డు నెంబర్ 13 లో ఎలాంటి ఆక్రమణలు లేవని స్థానిక కౌన్సిలర్ వాజీబ్ చెప్పారు. ఇది సీపీడబ్ల్యుడీ రోడ్డు. MCDకి దీనితో ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. షాహీన్ బాగ్ లో నిర్మాణాల కూల్చివేత సమయంలో ఆప్ ఎమ్మెల్యే ఓఖ్లా ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ఈ చర్య తీసుకొన్నారని ఆయన విమర్శించారు.తాను ఇక్కడ ఉన్నాను.....ఆక్రమణ ఎక్కడ ఉందో చూపించాలని ఆయన పేర్కొన్నారు.

AAP, Congress నేతృత్వంలో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించడంతో బుల్డోజర్లు ఎక్స్ కవేటర్లు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లాయి. రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు ఇతర సంఘ వ్యతిరేక శక్తులు నేతృత్వంలో ఉన్న ఆక్రమణలను తొలగించాలని ఈ ఏడాది ఏప్రిల్ 20న ఢిల్లీ BJP చీఫ్ ఆదేశ్ గుప్తా లేఖ రాసిన తర్వాత SDMC ప్రాంతాల్లో ఆక్రమణల కూల్చివేతలను ప్రారంభించాయని ఇతర పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.

ఈ నెల 5 నే షాహీ‌న్ బాగ్ లో ఆక్రమణల కూల్చివేతను పరారంభించాలని భావించామని,ఆ రోజున తగినంత పోలీసు ఫోర్స్ అందుబాటులో లేని కారణంగా కూల్చివేతలను చేపట్టలేదని ఎస్‌డీఎంసీ వివరించింది.

ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని జహంగీర్ పురిలో లో మత ఘర్షణలు చోటు చేసుకొన్న తర్వాత ఆక్రమణల కూల్చివేతను ప్రారంభించారు. మత ఘర్షణలు ప్రారంభమైన ప్రాంతంలోనే కూల్చివేతలు జరిగాయి.

గత వారమే సీపీఎం ఢిల్లీ కమిటీతో పాటు Hac యూనియన్ దక్షిణ ఢిల్లీ మున్సిపాలిటీ చేపట్టిన ఆక్రమణల కూల్చివేతన సుప్రీంలో సవాల్ చేసింది. సహజ న్యాయ, శాసనాలు, రాజ్యాంగం యొక్క సూత్రాలకు అతీతంగా కూల్చివేతలు సాగుతున్నాయని సీపీఎం అభిప్రాయపడింది.

దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఆరోపించినట్టుగా తాము అనధికారిక ఆక్రమణదారులు లేదా ఆక్రమణదాలు కాదని స్థానికులు చెబుతున్నారు.సరైన షోకాజ్ నోటీసు లేకుండా కూల్చివేతలు చేయడాన్ని పిటిషన్ దారులు ప్రశ్నించారు.