మహిళలపై స్వయంప్రకటిత దేవుడి లైంగిక వేధింపులు.. అరెస్ట్...
నిందితుడు వినోద్ కశ్యప్ ఢిల్లీలోని కక్రోలా ప్రాంతంలో మాతా మసానీ చౌకీ దర్బార్ అనే శిబిరాన్ని నిర్వహిస్తున్నాడు. అక్కడికి వచ్చే మహిళా భక్తులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.
న్యూఢిల్లీ : మహిళా భక్తులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ గాడ్ మ్యాన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాబాలు, స్వాముల గురించి ఇలాంటి వార్తలు ఎన్ని వెలుగు చూసినా వారిని నమ్మకుండా ఉండరు. పోయి, పోయి వారి వలలో చిక్కుతుంటారు. మూఢనమ్మకాలు, ఏదో మంచి జరుగుతుందన్న ఆశ.. తమకు ఉన్నదానికంటే ఇంకేదో కావాలనే అత్యాశ.. వెరసి ఈ బాబాలు, స్వామీజీలకు పెట్టుబడిగా మారి మోసాలు సాగుతున్నాయి.
తాజాగా ఇలాంటి ఘటనే న్యూ ఢిల్లీలో వెలుగు చూసింది. ఇద్దరు మహిళా భక్తులు ఫిర్యాదు చేయడంతో.. అతనిమీద రెండు లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. దీని ప్రకారం స్వయం ప్రకటిత దేవుడ్ని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు బుధవారం తెలిపారు. నిందితుడు (33) వినోద్ కశ్యప్ అనే వ్యక్తి దేశ రాజధానిలోని కక్రోలా ప్రాంతంలో మాతా మసానీ చౌకీ దర్బార్ అని నడుపుతున్నాడు.
మోడీ స్పూర్తిదాయకమైన మద్దతు: ఏషియన్ గేమ్స్ లో పాల్గొన్న అథ్లెట్లు
అతని పేరు మీద యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. దీనికి పెద్ద సంఖ్యలో సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ‘‘రెండు సందర్భాల్లోనూ తన దగ్గరికి సమస్యతో వచ్చిన మహిళా భక్తులను.. వారి సమస్యలు తీరడంలో సాయం చేస్తానన్న నెపంతో పిలిపించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదుల ప్రకారం భక్తులు తమ సమస్యల నుంచి విముక్తి పొందేందుకు ‘గురుసేవ’ ఆచరించాలని నిందితుడు పట్టుబట్టారు.
ఆ తరువాత మహిళలు తమపై జరిగిన లైంగిక వేధింపులను, ఆ సంఘటనను ఎవరికీ చెప్పొద్దని..అలా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారని’’ ఒక అధికారి తెలిపారు. వీరి ఫిర్యాదు మేరకు అతని మీద ఐపీసీ సెక్షన్ 376, 506 కింద 2 కేసులు నమోదు చేసాం. నిందితుడిని అరెస్టు చేశాం" అని అధికారి తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.