Asianet News TeluguAsianet News Telugu

మహిళలు రెచ్చగొట్టే దుస్తులు ధరించినప్పుడు లైంగిక వేధింపుల అభియోగం నిలబడదు.. కేరళ కోర్టు

కేరళలోని కోజికోడ్ జిల్లాలోని సెషన్ కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లైంగిక వేధింపుల కేసులో రచయిత, సామాజిక కార్యకర్త సివిక్ చంద్రన్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. మహిళ దుస్తులు లైంగికంగా రెచ్చగొట్టేలా ఉన్నాయని జిల్లా సెషన్స్ కోర్టు పేర్కొంది. 

Sexual Harassment Complaint Will Not Prima Facie Stand When Woman Was Wearing Sexually Provocative Dress says kerala district sessions court
Author
First Published Aug 17, 2022, 1:27 PM IST

కేరళలోని కోజికోడ్ జిల్లాలోని సెషన్ కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లైంగిక వేధింపుల కేసులో రచయిత, సామాజిక కార్యకర్త సివిక్ చంద్రన్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. మహిళ దుస్తులు లైంగికంగా రెచ్చగొట్టేలా ఉన్నాయని జిల్లా సెషన్స్ కోర్టు పేర్కొంది. అందువల్ల ఈ కేసులో ఐపీసీ సెక్షన్ 354 A (లైంగిక వేధింపు) ప్రాథమికంగా వర్తించదని న్యాయమూర్తి కృష్ణకుమార్.. సివిక్ చంద్రన్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

కోయిలాండి పోలీసులు తనపై నమోదు చేసిన రెండో లైంగిక వేధింపుల కేసులో సివిక్ చంద్రన్‌ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తనపై మహిళ తప్పుడు ఫిర్యాదు చేసిందని చంద్రన్‌ ఆరోపించారు. అలాగే ఫిర్యాదారుకు సంబంధించిన ఫోటోలను కూడా అతడు కోర్టుకు సమర్పించారు. మహిళ యొక్క పోటోలను ప్రస్తావిస్తూ..  ‘‘వాస్తవ ఫిర్యాదుదారు స్వయంగా లైంగికంగా రెచ్చగొట్టే దుస్తులను బహిర్గతం చేస్తున్నట్లు ఇది వెల్లడిస్తుంది. కావున సెక్షన్ 354A నిందితులకు వ్యతిరేకంగా ప్రాథమికంగా నిలబడదు’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.  ఈ కేసులో సివిక్ చంద్రన్‌కు బెయిల్ మంజూరు చేశారు. 354A సెక్షన్ కింద కేసు నమోదు చేయడానికి.. ఒక మహిళ యొక్క గౌరవానికి భంగం కలిగిందని నిరూపించడానికి తగిన ఆధారాలు ఉండాలని పేర్కొన్నారు. 

ఈ కేసులో ఆగస్టు 12వ తేదీనే సివిక్ చంద్రన్‌కు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా.. ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఈ వివాదాస్పద వ్యాఖ్య బయటకు వచ్చింది. ఇక, సివిక్ చంద్రన్‌పై నమోదైన మరో లైంగిక వేధింపుల కేసులో అతడు ఆగస్టు 2న ముందస్తు బెయిల్ పొందాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios