Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీలోని యుపి భవన్‌లో మహిళపై లైంగిక వేధింపు.. ముగ్గురు అధికారుల సస్పెన్షన్..

ఢిల్లీలోని ఉత్తరప్రదేశ్ భవన్‌లోని ఓ గదిలో తనను లైంగికంగా వేధించారని ఓ మహిళ ఆరోపించింది. ఘటన జరిగిన 122వ నంబర్ గదిని పోలీసులు సీల్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు.

Sexual assault on a woman in Delhi's UP Bhavan, 3 officials suspended - bsb
Author
First Published May 30, 2023, 2:01 PM IST

ఢిల్లీ : ఢిల్లీలోని ఉత్తరప్రదేశ్ భవన్, స్టేట్ గెస్ట్ హౌస్‌లోని ఒక గదిలో తనను లైంగికంగా వేధించారని ఒక మహిళ ఆరోపించింది. ఆ తర్వాత లైంగిక వేధింపులు జరిగినట్లు ఆరోపించిన గది నంబర్ 122 కు ఢిల్లీ పోలీసులు సీలు చేశారు.నిందితుడు రాజ్యవర్ధన్ సింగ్ పర్మార్‌పై మహిళ చాణక్యపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడు మహారాణా ప్రతాప్ సేన అనే సంస్థకు జాతీయ అధ్యక్షుడు.

మే 26, మధ్యాహ్నం 12:15 గంటలకు నిందితుడు బాధితురాలితో కలిసి గదిలో దిగాడు. ఆ తరువాత అతను మధ్యాహ్నం 1:50 గంటలకు వెళ్లిపోయాడు. ఓ అధికారిని కలిపిస్తానన్న సాకుతో నిందితుడు తనకు గదికి తీసుకువచ్చాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే, ఘటన జరిగిన సమయంలో గదిలో ఎవరూ లేరని సమాచారం.

మరోవైపు ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉత్తరప్రదేశ్ భవన్‌లో నియమితులైన దినేష్ కరూష్, రాకేష్ చౌదరి మరియు పరాస్ అనే ముగ్గురు అధికారులు సస్పెండ్ చేసింది. రాజీవ్ తివారీకి ప్రస్తుతానికి యూపీ భవన్ బాధ్యతలు అప్పగించారు.

మహిళ ఫిర్యాదు ఆధారంగా, భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 354 (ఆమె నమ్రతను కించపరిచే ఉద్దేశ్యంతో ఒక మహిళపై దాడి లేదా నేరపూరిత బలవంతం) కింద కేసు నమోదు చేయబడింది. సంఘటన జరిగిన గదిని పరిశీలించేందుకు క్రైమ్ టీమ్‌ను పిలిపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

స‌ర్జిక‌ల్ స్ట్రైక్.. ఆర్మీలో మ‌హిళా శ‌క్తి : మోడీ 9 ఏళ్ల పాల‌న‌లో రక్షణ రంగ బ‌లోపేతానికి చేప‌ట్టిన చ‌ర్య‌లు..

ఇదిలా ఉండగా, మే 15న ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి వేధింపుల ఘటనే వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్‌ గా పనిచేస్తున్న ఓ వ్యక్తిని అక్కడి  12 మంది విద్యార్థినులను వేధించినందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసుకు సంబంధించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుల్లో ఒకరిపై కూడా అభియోగాలు మోపబడ్డాయని, వారిని సస్పెన్షన్‌లో ఉంచినట్లు పోలీసులు తెలిపారు.

"తిల్హార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక జూనియర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 12 మంది బాలికలను కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ మహ్మద్ అలీ వేధింపులకు గురిచేశారు, వీరిలో కొంతమంది దళితులు కూడా ఉన్నారు" సర్కిల్ ఆఫీసర్ (తిల్హార్) ప్రియాంక్ జైన్ తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. కానీ అతను అలీపై ఎటువంటి చర్య తీసుకోలేదని జైన్ తెలిపారు. గ్రామ పెద్ద లలితా ప్రసాద్ ఫిర్యాదు మేరకు ఆ తరువాత కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్ ప్రకారం, ఓ దళిత విద్యార్థినిని అలీ వేధించాడు. ఆ విద్యార్థులు వారి కుటుంబాలకు సమాచారం అందించారు.. వారు గ్రామ పెద్దలకు తెలపడంతో ఫిర్యాదు చేశారు. 

కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాఠశాల వద్దకు చేరుకుని వీరంగం సృష్టించారు. బాలికలు, పాఠశాలలోని కొంతమంది ఉపాధ్యాయుల స్టేట్‌మెంట్‌లను అక్కడికక్కడే రికార్డ్ చేసినట్లు జైన్ తెలిపారు. విద్యార్థులను వైద్య పరీక్షల నిమిత్తం పంపినట్లు తెలిపారు. నిందితుడిపై షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, పోక్సో (లైంగిక నేరాల నుండి బాలల రక్షణ) చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ప్రాథమిక శిక్షా అధికారి కుమార్ గౌరవ్ మాట్లాడుతూ ప్రాథమికంగా కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ దోషిగా తేలాడని, అతని సేవలను రద్దు చేస్తామని తెలిపారు.స్కూల్ ప్రిన్సిపాల్ అనిల్ కుమార్, అసిస్టెంట్ టీచర్ సజియాలను కూడా వెంటనే సస్పెండ్ చేసినట్లు గౌరవ్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios