వ్యభిచారానికి మొబైల్ యాప్.. ముఠా తెలివితేటలకు మైండ్‌బ్లాంకైన‌ పోలీసులు.. రాంచీలో వ్యవహారం

First Published 23, Jul 2018, 6:27 PM IST
Sex racket operating on mobile app.. police raids in ranchi
Highlights

దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో వ్యభిచారం సజావుగా సాగిపోతోంది. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహారిస్తున్నా.. ఎంతగా దాడులు నిర్వహిస్తున్నా.. వ్యభిచార ముఠాలు తెలివి మీరిపోతున్నాయి. తాజాగా మొబైల్ యాప్ ద్వారా వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు రాంచీ పోలీసులు

దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో వ్యభిచారం సజావుగా సాగిపోతోంది. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహారిస్తున్నా.. ఎంతగా దాడులు నిర్వహిస్తున్నా.. వ్యభిచార ముఠాలు తెలివి మీరిపోతున్నాయి. తాజాగా మొబైల్ యాప్ ద్వారా వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు రాంచీ పోలీసులు.. నగరంలోని బృందా ప్యాలెస్ హోటల్‌ను అడ్డాగా తీసుకుని ఒక మొబైల్ యాప్ ద్వారా ఈ ముఠా దందాను కొనసాగిస్తోంది.

ముందుగా మొబైల్ యాప్ ద్వారా బృందా హోటల్‌లోని గదులను బుక్ చేసుకుని.. పెళ్లి కాని జంటలను గదుల్లోకి పంపిస్తున్నట్లుగా తెలిసింది. ఇందుకు గాను పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారు. స్థానికులకు ఈ వ్యవహారంపై అనుమానం రావడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు బృందా ప్యాలెస్‌పై దాడులు నిర్వహించి నాలుగు జంటలను.. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.. దీని వెనుక ఉన్న కీలకవ్యక్తులు పరారీలో ఉండటంతో వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. 
 

loader