Asianet News TeluguAsianet News Telugu

సుప్రీంకోర్టులో కరోనా కలకలం...తాజాగా 10మంది జడ్జీలకు పాజిటివ్..

జస్టిస్ కెఎమ్ జోసెఫ్, జస్టిస్ పిఎస్ నరసింహులు కరోనా నుంచి కోలుకుని తిరిగి విధులకు హాజరు అవుతున్నారు. మిగతా ఎనిమిది మంది జడ్జీలు కరోనాతో క్వారంటైన్ లో ఉన్నారు. దీంతో సుప్రీం కోర్టులో అత్యవసర కేసుల విచారణకు బెంచ్ లఏర్పాటు చీఫ్ జస్టిస్ NV Ramanaకు చాలెంజ్ గా మారింది.

Severe Covid wave in Supreme Court, 10 judges infected
Author
Hyderabad, First Published Jan 19, 2022, 11:23 AM IST

న్యూఢిల్లీ :  ఢిల్లీలోని సుప్రీంకోర్టులో corona కలకలం చెలరేగింది. సుప్రీంకోర్టులో 10 మంది జడ్జిలకు covid positvie అని పరీక్షల్లో తేలడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. supreme court ఆరోగ్య శాఖ ఉద్యోగులు ప్రతిరోజు కరోనా పరీక్షలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో కోవిడ్ పాజిటివిటీ రేటు 30 శాతానికి పెరిగిందని సుప్రీంకోర్టు ఉద్యోగులు తెలిపారు. సుప్రీంకోర్టులో మొత్తం 32 మంది judgeలు ఉండగా వారిలో 10 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 

జస్టిస్ కెఎమ్ జోసెఫ్, జస్టిస్ పిఎస్ నరసింహులు కరోనా నుంచి కోలుకుని తిరిగి విధులకు హాజరు అవుతున్నారు. మిగతా ఎనిమిది మంది జడ్జీలు కరోనాతో క్వారంటైన్ లో ఉన్నారు. దీంతో సుప్రీం కోర్టులో అత్యవసర కేసుల విచారణకు బెంచ్ లఏర్పాటు చీఫ్ జస్టిస్ NV Ramanaకు చాలెంజ్ గా మారింది.

సుప్రీంకోర్టులో కోవిడ్ కలకలంతో 24 గంటల పాటు వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు. సుప్రీంకోర్టులో ప్రతిరోజు 200మంది వరకు ఆర్ టి పి సి ఆర్ పరీక్షలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో 1500 మంది ఉద్యోగులు ఉంటే వారిలో 400 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. సుప్రీం కోర్టు ప్రాథమిక వైద్య కేంద్రంలో పనిచేస్తున్న ముగ్గురు వైద్యులకు కూడా  కరోనా సోకింది. వారం రోజుల్లో కరోనా సోకిన జడ్జిల సంఖ్య రెట్టింపు  అయ్యింది. సుప్రీంకోర్టులో కరోనా కేసులు వ్యాప్తితో కోర్టుల్లో వర్చువల్ గా హియరింగ్ లు సాగుతున్నాయి. 

ఇదిలా ఉండగా, జనవరి 9న సుప్రీంకోర్టులో నలుగురు జడ్జిలకు కరోనా సోకడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో 150 మంది సిబ్బంది క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇందులో కొంత మందికి కరోనా పాజిటివ్ తేలినవారూ ఉన్నారు.

సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణతో కలుపుకుని 32 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఇందులో నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. తొలుత ఓ న్యాయమూర్తికి జ్వరం వచ్చింది. ఆయన మంగళవారం జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి వీడ్కోలు కార్యక్రమానికి వెళ్లారు. ఆ తర్వాత వచ్చిన ఆయన కరోనా టెస్టు రిజల్ట్‌లో పాజిటివ్ అని తేలింది.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సారథ్యంలో ఐదుగురు సభ్యులతో ఓ సమావేశం జరిగింది. ‘దేశంలో మరోసారి ఆ సమస్య పెరుగుతున్నది. వీటిని మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. కేసులు పెరుగుతున్నాయి. అందుకే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వచ్చే నాలుగు నుంచి ఆరు వారాల పాటు ప్రత్యక్షంగా విచారంచలేకపోవచ్చు’ అని ఆ సమావేశంలో సీజేఐ ఎన్వీ రమణ వెల్లడించారు. 

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రెండు వారాలపాటు ఆన్‌లైన్‌లోనే విచారణ చేపట్టనున్నారు. కానీ, కొన్ని తీవ్రమైన కేసులను మాత్రమే ప్రత్యక్షంగా విచారిస్తామని తెలిపారు. కాగా, కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా వేగంగా చుట్టుకొస్తున్నది. కొత్త Omicron Variant ఈ భయాలను రెట్టింపు చేసింది. సాధారణ పౌరులతోపాటు ప్రభుత్వాధినేతలు, పార్లమెంటు, సుప్రీంకోర్టులోనూ పంజా విసురుతున్నది. రాజస్తాన్, జార్ఖండ్‌తోపాటు ఇంకొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కరోనా పాజిటివ్ అని తేలింది. 

Follow Us:
Download App:
  • android
  • ios