జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లోని (Anantnag) ఓ ప్రసూతి ఆసుపత్రిలో మంగళవారం సిలిండర్ పేలుడు (cylinder blast 0 సంభవించింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. 

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లోని (Anantnag) ఓ ప్రసూతి ఆసుపత్రిలో మంగళవారం సిలిండర్ పేలుడు (cylinder blast 0 సంభవించింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అనంత్‌నాగ్‌లోని షైర్‌బాగ్‌లోని మెటర్నిటీ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్ (ఎంసీసీహెచ్)లో ఈ ఘటన చోటు చేసుకుంది. హీటింగ్ గ్యాస్ సిలిండర్‌లో లీకేజీ కారణంగా పేలుడు సంభవించిందని MCCH అధికారి ఒకరు తెలిపారు. ఆస్పపత్రి టిక్కెట్ విభాగంలో ఈ పేలుడు చోటుచేసుకుందన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఆస్పత్రికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

ఈ ప్రమాదంలో కొంతమంది ఆస్పత్రి ఉద్యోగులతో పాటు పలువరు గాయపడ్డారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గాయపడినవారిని అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించినట్టుగా వెల్లడించాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Scroll to load tweet…