క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. రాత్రి కావడంతో ఎంత మంది చనిపోయారనే విషయంలో స్పష్టత లేదని పోలీసులు తెలిపారు.
కర్ణాటక రాష్ట్రం శివమొగ్గలో గురువారం భారీ పేలుడు సంభవించింది. అబ్బలగిరె గ్రామ సమీపంలో.. ఈ ప్రమాదం సంభవించింది. కాగా... ఈ ప్రమాదంలో దాదాపు 10మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
కాగా... క్వారాలో ఉపయోగించే పేలుడు పదార్థాలు తలరిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. పేలుడు పదార్థాలు తరలిస్తున్న వాహనం పూర్తితగా ధ్వంసమైంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. రాత్రి కావడంతో ఎంత మంది చనిపోయారనే విషయంలో స్పష్టత లేదని పోలీసులు తెలిపారు.
శివమొగ్గ జిల్లాతో పాటు సమీపంలోని చిక్‌మంగళూరు జిల్లాలోనూ రాత్రి 10:30 గంటలకు భూప్రకంపనలు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. క్వారీ పేలుడు పదార్థాలు తరలిస్తున్న లారీలో పేలుడు సంభవించిన తర్వాతే భూప్రకంపనలు చోటు చేసుకుని ఉండొచ్చని స్థానికులు పేర్కొన్నారు. భారీ శబ్దాలు వచ్చాయని చెప్పారు.
కిటికీలు కాసేపు కదిలాయని తెలిపారు. భూకంపం అనుకుని జనాలందరూ భయంతో బయటకు పరుగులు తీశారు. పలు భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. శివమొగ్గ, చిక్‌మంగళూరు జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు రాత్రంతా రోడ్లపైనే ఉండిపోయారు.
