ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రమాకాంత్ యాదవ్ మేనల్లుడు నిర్వహిస్తున్న లిక్కర్ షాపులో మద్యం సేవించి 9 మంది చనిపోయారు. వీరిలో 12 మంది పరిస్ధితి అత్యంత విషమంగా వుండగా.. కొందరు చూపు కోల్పోయారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల (uttar pradesh election 2022) వేళ సమాజ్‌వాదీ పార్టీకి (samajwadi party) చెందిన రమాకాంత్ యాదవ్ (ramakant yadav) చిక్కుల్లో పడ్డారు. ఆయన మేనల్లుడు నిర్వహిస్తున్న లిక్కర్ షాపులో మద్యం సేవించి 9 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. వీరిలో 12 మంది పరిస్ధితి అత్యంత విషమంగా వుండగా.. కొందరు చూపు (hooch tragedy) కోల్పోయారు. ఆదివారం రాత్రి మాహుల్ పట్టణంలో జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. గ్రామస్తులు మద్యం కొనుగోలు చేసిన దుకాణం మాజీ ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ధి రమాకాంత్ యాదవ్ మేనల్లుడు రంజేష్‌కు చెందినది.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం వినియోగం విపరీతంగా పెరిగింది. దీనిని క్యాష్ చేసుకుంటున్న కొందరు కల్తీ మద్యాన్ని కూడా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అజంగఢ్ జిల్లాలో, ప్రభుత్వ యాజమాన్యంలోని మద్యం కాంట్రాక్ట్‌తో విక్రయిస్తున్న మద్యం ఈ విషాదానికి కారణమైంది . కల్తీ మద్యాన్ని సేవించిన సుమారు 50 మంది వివిధ ఆసుపత్రులలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ వార్తతో ఉత్తరప్రదేశ్ ఉలిక్కిపడింది.
ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల నేపథ్యంలో కల్తీ మద్యం ఘటన చోటుచేసుకోవడంపై దుమారం రేగుతోంది. డీఎం, ఎస్పీ సహా సీనియర్ అధికారుల బృందం మహూల్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తోంది. విషమంగా వున్న వారిలో నలుగురిని సీహెచ్‌సీ నుంచి జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఏయే షాపుల్లో ఎవరెవరు మద్యం సేవించారనేది కూడా నిర్ధారిస్తున్నారు. షాపు సేల్స్‌మెన్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు గ్రామస్తులను, చుట్టుపక్కల వారిని పోలీసులు విచారించారు. దీంతో పాటు ఆదివారం ఈ షాపులో ఇంకా ఎవరెవరు మద్యం సేవించారో... తేల్చేందుకు అధికారులు ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మృతులంతా ఒకే పంచాయతీ పరిధిలోని వివిధ వార్డులకు చెందినవారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, వారిని విచారిస్తున్నామని ఎస్పీ అనురాగ్ ఆర్య వెల్లడించారు.
ఈ ఘటనతో ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల అండదండలతోనే దుకాణాల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎక్కువ లాభం పొందేందుకు ప్రభుత్వ దుకాణాల్లో ప్రజలకు విషపూరితమైన మద్యాన్ని విక్రయించారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని ప్రజలను శాంతింపజేసే పనిలో నిమగ్నమయ్యారు.
కాగా.. గతేడాది మేలో మిట్టుపూర్ గ్రామంలో కల్తీ మద్యం తాగి 30 మందికి పైగా చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత జిల్లా యంత్రాంగం అక్రమ మద్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.
"
