శ్రీలంక వరస పేలుళ్ల ఘటన ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనను ప్రజలు ఇంకా మర్చికపోకముందే.. అలాంటి దాడులే భారత్ లో ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందించింది. అది కూడా దక్షిణాది రాష్ట్రాలను ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నట్లు సమాచారం అందింది. దీంతో.. ఇంటిలిజెన్స్ వర్గాలు సంబంధిత అధికారులను అప్రమత్తం చేశాయి.

ఉగ్రవాదులు... దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రల్లో పేలుళ్లకు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. శక్తివంతమైన పేలడు పదార్థాలతో దాడులకు ప్లాన్ చేశారని అధికారులు తెలిపారు. దాడుల పంథాను ఉగ్రవాదులు మార్చుకున్నారని అధికారులు చెబుతున్నారు.

ఈ సారి రైళ్లు, రైల్వే స్టేషన్లను ఉగ్రవాదులు టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందరూ అప్రమత్తంగా ఉండలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.