అసోం రాష్ట్రంలో శనివారం నాడు  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన  బస్సు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది


గౌహాతి: అసోం రాష్ట్రంలో శనివారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గౌహాతి, ముకల్‌మువా మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకొంది. విషయం తెలిసిన వెంటనే అధికారులు హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. స్థానికులు కూడ సహాయక చర్యల్లో అధికారులకు సహకరిస్తున్నారు.

క్షతగాత్రులను సమీప ఆసుత్రికి తరలించారు. స్థానికంగా ఉన్న ఆసుపత్రుల్లో ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం ఏరియా ఆసుపత్రులకు తరలించారు. 

 అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అసోం రాష్ట్ర రవాణా సంస్థ బస్సు అదుపు తప్పి చెరువులోకి జారిపడటంతో ఏడుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది గాయపడ్డారు. గౌహతి, ముకల్‌మువా మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.