కారులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వాహనంలోని సుమారు 250 కట్టల రూ.2వేల నోట్లు ఉన్న బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులు ఇచ్చిన సమాచారంతో అంధేరిలోని ఓ హోటల్ మీద దాడి చేసి మరో ముగ్గురిని అరెస్ట్ చేసిసట్లు వెల్లడించారు. ఈ ముఠా నుంచి.. నకిలీ నోట్లతో పాటు ఓ ల్యాప్ టాప్, ఏడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ముంబై : మహారాష్ట్రలో fake currency కలకలం రేపింది. ఏకంగా ఏడు కోట్లు బయటపడడం ఆందోళన కలిగించింది.
Mumbai Crime Branch పోలీసులు జరిపిన దాడుల్లో రూ.7కోట్ల మేర నకిలీ కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. దీంతో సంబంధం ఉన్న ఏడుగురిని పోలీసులు arrest చేశారు. నిందితులను అంతర్రాష్ట్ర ముఠాకు చెందినవారుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు ముంబయి శివారు ప్రాంతంలోని దహిసర్ చెక్ పోస్ట్ వద్ద నిందితులు కారును అడ్డగించినట్లు చెప్పారు.
కారులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వాహనంలోని సుమారు 250 కట్టల రూ.2వేల నోట్లు ఉన్న బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులు ఇచ్చిన సమాచారంతో అంధేరిలోని ఓ హోటల్ మీద దాడి చేసి మరో ముగ్గురిని అరెస్ట్ చేసిసట్లు వెల్లడించారు. ఈ ముఠా నుంచి.. నకిలీ నోట్లతో పాటు ఓ ల్యాప్ టాప్, ఏడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా, నిరుడు డిసెంబర్ లో తెలుగు రాష్ట్రాల్లో నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ముఠా గుట్టును గుంటూరు పోలీసులు రట్టు చేశారు. ముఠా సభ్యుల్లోని ఇద్దరిని అరెస్టు చేయగా మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రెండురోజుల క్రితం గుంటూరు జిల్లా మేడికొండూరు గ్రామంలోని ఓ దుకాణాదారుడు వద్దకు వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సరుకులు కొనుగోలు చేసి రూ.200నోటును ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఆ నోటు అనుమానాస్పదంగా వుండటంతో దుకాణ యజమాని మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు గుంటూరు జిల్లాకు చెందిన ఒకరిని, అనంతరం మరొకరిని అదుపులోకి తీసుకుని విచారించగా డొంక కదిలింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి గుంటూరులో నెలరోజులుగా కలర్ జిరాక్స్ సహాయంతో రూ.100, 200, 500 నోట్లను ముద్రించి చలామణి చేస్తున్నారని పోలీసులు వివరించారు. ఇప్పటి వరకు లక్షల్లోనే ఈ నోట్లను చలామణి చేశారని పోలీసులు పేర్కొన్నారు. పట్టుకున్న ఇద్దరిని రిమాండ్‌కు తరలించామని చెప్పారు.
కాగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నల్లధనం వెలికి తీయడానికి 2016 నవంబర్ ఎనిమిదో తేదీన అప్పటికి చలామణిలో ఉన్న రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వాటి స్థానంలోనే రూ.2000, రూ.500 నోట్లను చలామణిలోకి తెచ్చారు. అయితే జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) డేటా ప్రకారం ఆ తర్వాత ఏడాది 2017-18లో దేశంలో పట్టుకున్న నకిలీ నోట్లలో 56 శాతం రూ.2000 విలువైన నోట్లే కావడం గమనార్హం.
2019లో గుజరాత్ రాష్ట్రంలో 34,680 నోట్లు రూ.2000 విలువైనవి. నోట్ల రద్దు తర్వాత గుజరాత్లో పట్టుబడిన నకిలీ నోట్లు దేశమంతా కలిపితే 26.28 శాతం. తర్వాతీ జాబితాలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. జార్ఖండ్, మేఘాలయ, సిక్కిం రాష్ట్రాల్లో మాత్రం ఒక్క రూ.2000 నోటు కూడా నకిలీ నోట్ దొరకలేదు.
