Mumbai: ముంబయిలో మీజిల్స్ (తట్టు) కారణంగా ఏడుగురు చిన్నారులు మరణించారు. కొత్త కేసులు పెరుగుతున్నాయి. 142 కేసులను గుర్తించగా.. అనుమాతని కేసులు వేయి దాటాయి. అప్రమత్తమైన అధికారులు.. వ్యాక్సిన్ పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.  

Measles: దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో మీజిల్స్ (తట్టు) వ్యాప్తి కొనసాగుతోంది. మీజిల్స్ (తట్టు) కారణంగా ఏడుగురు చిన్నారులు మరణించారు. కొత్త కేసులు పెరుగుతున్నాయి. 142 కేసులను గుర్తించగా.. అనుమాతని కేసులు వేయి దాటాయి. చర్యలు చేపట్టిన అధికారులు.. వ్యాక్సిన్ పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. 

వివరాల్లోకెళ్తే.. ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ లెక్కల ప్రకారం మీజిల్స్‌తో బాధపడుతున్న వారి సంఖ్య 142కి పెరిగింది. ముంబయి నగరంలో మంగళవారం (నవంబర్ 15) 126 ఉన్న మీజిల్స్ కేసుల సంఖ్య బుధవారం నాటికి 142కి పెరిగింది. అదే సమయంలో, మీజిల్స్ అనుమానిత కేసుల సంఖ్య 908 నుండి 1,079కి పెరిగింది. ఇప్పటి వరకు అనుమానాస్పద తట్టు కారణంగా మొత్తం 7 మంది చిన్నారులు చనిపోయారు. ముబయిలోని కస్తూర్బా ఆస్పత్రిలో 66 మంది చిన్నారులు చికిత్స పొందుతుండగా, వారిలో 5 మంది చిన్నారులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం సాయంత్రం కస్తూర్బా ఆసుపత్రిలో 6 మంది కొత్త రోగులు చేరారు. పాఠశాలలో జ్వరం, శరీరంపై దద్దుర్లు ఉన్న చిన్నారులపై సంబంధిత ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. జ్వరాలతో పాటు దద్దుర్లు, రోగులను గుర్తించేందుకు విద్యాశాఖతో సమన్వయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు.

వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పిస్తున్న యంత్రాంగం.. 

ముంబయి నగరంలో కేసులు మీజిల్స్ (తట్టు) కేసులు పెరుగుతున్న క్రమంలో అప్రమత్తమైన అధికారులు చర్యలు చేపట్టారు. వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. మీజిల్స్ వ్యాప్తిని నియంత్రించడానికి కోవిడ్-19 తరహాలో వార్‌రూమ్‌లు తయారు చేయబడ్డాయి. శివాజీ నగర్ సివిల్ హాస్పిటల్‌లో తేలికపాటి లక్షణాలు ఉన్న రోగుల కోసం ప్రత్యేక స్థలం కేటాయించారు. అలాగే, శతాబ్ది, గోవండి ఆసుపత్రి, రాజావాడి ఆసుపత్రిలో తీవ్రమైన రోగుల కోసం ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన రోగులను చికిత్స నిమిత్తం కస్తూర్బా ఆసుపత్రిలో చేర్పిస్తున్నారు. ఇందులో మీజిల్స్‌తో బాధపడుతున్న చిన్నారుల కోసం మాత్రమే మూడు ప్రత్యేక వార్డులను ఉంచారు.

ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశాలు.. 

జ్వరం, దద్దుర్లు కేసులపట్ల అప్రమత్తంగా ఉండాలనీ, ప్రయివేటు ఆసుపత్రులు, ప్రయివేటు ప్రాక్టీస్‌లో ఉన్న వైద్యులు, నర్సింగ్‌హోమ్‌లలో వైద్యులకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ముంబయిలోని గోవండి ప్రాంతంలో ఇప్పటివరకు అత్యధిక మీజిల్స్ కేసులు నమోదయ్యాయి, బీఎంసీ అధికారులు, ఉద్యోగులు ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్లి ప్రజలను సర్వే చేస్తున్నారు. ఈ సర్వేలో చలి జ్వరం, శరీరంపై దద్దుర్లు ఉన్న చిన్నారులు, వారి సమాచారం తీసుకుని అవసరాన్ని బట్టి ఆసుపత్రిలో చేర్పించేలా సూచనలు కూడా చేస్తున్నారు.

నగరం మొత్తంలో ఏ ప్రాంతంలో ఎన్ని మీజిల్స్ కేసులు ఉన్నాయంటే.. 

డియోనార్, గోవండి - 44
కుర్లా చునాభట్టి - 29
ఘట్‌కోపర్, విద్యావిహార్ -14
మాతుంగ, సియోన్ -12
బాంద్రా, ఖార్, శాంతాక్రూజ్ -11
చెంబూర్, తిలక్ నగర్ - 6
ధారవి, దాదర్ - 6
నాగ్‌పాడ, భయకాల -5

ముగ్గురు సభ్యుల బృందం ఏర్పాటు

బీఎంసీతో సహా ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశ ప్రాంతీయ అధిపతి, ఆయన బృందం కూడా తాజా సర్వేలో పాల్గొంటుంది. అదే సమయంలో, కేంద్ర ఆరోగ్య బృందాలు కూడా బీఎంసీ పరిధిలో పెరుగుతున్న కేసుల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకుంటున్నాయి. ఇందుకోసం ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీరిలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC)-న్యూఢిల్లీ, లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ (LHMC)-న్యూఢిల్లీ, ప్రాంతీయ ఆరోగ్య-కుటుంబ సంక్షేమ కార్యాలయం-పూణే, మహారాష్ట్రకు చెందిన పలువురు వైద్య నిపుణులు ఉన్నారు.