Asianet News TeluguAsianet News Telugu

డెల్టాప్లస్‌తో మరో మరణం: మధ్యప్రదేశ్‌లో ఏడుకి చేరిన కేసులు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో  కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా మరో మరణం చోటు చేసుకొంది.ఈ వైరస్ కారణంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే చోటు చేసుకొన్నాయి. రాష్ట్రంలో  ఏడు డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి.

Seven Cases Of Delta-Plus Covid In Madhya Pradesh, Two Patients Died lns
Author
Bhopal, First Published Jun 25, 2021, 5:41 PM IST

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో  కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా మరో మరణం చోటు చేసుకొంది.ఈ వైరస్ కారణంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే చోటు చేసుకొన్నాయి. రాష్ట్రంలో  ఏడు డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి.మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి 1,219 నుండి శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నేషనల్ సెంటర్ ఆఫ్ డీసీజ్ కంట్రోల్ కు పంపారు. అయితే ఇందులో 31 శాతం నమూనాలు ఆందోళనకరంగా ఉన్నాయని ఎన్‌‌సీడీసీ ప్రకటించింది.

 మధ్యప్రదేశ్‌లో నమోదైన 6 డెల్డా వేరియంట్‌ కేసులలో భూపాల్‌లో 2 కేసులు, ఉజ్జయినిలో 2 కేసులు, శివపూరి సమీపంలోని రైసన్‌, అశోక్‌నగర్‌ల నుంచి ఒక్కో డెల్టా వేరియంట్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.మన దేశంలో ఇప్పటి వరకు, 318 డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు బయట పడ్డాయి. అదే విధంగా, యూకేలోని లండన్‌లో ఆల్ఫా వైరస్‌ రకానికి చెందిన 56 కేసులు నమోదయ్యాయి. డెల్టా ప్లస్  వేరియంట్ కేసులు నమోదైన ప్రాంతాల్లో కఠినమైన ఆంక్షలు అమలు చేసి వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.

Follow Us:
Download App:
  • android
  • ios