Asianet News TeluguAsianet News Telugu

వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి షాకిచ్చిన యూకే కోర్టు.. భారత్ కు అప్పగించడానికి లైన్ క్లియర్ 

పీఎన్‌బీ రుణ కుంభకోణం కేసు,మోసం, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీని భారత్‌కు తీసుకురావడానికి మార్గం సుగమమైంది. భారతదేశానికి అప్పగించాలనే ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను యూకే కోర్టు తిరస్కరించింది.

Setback for Nirav Modi as UK High Court orders his extradition to India to face fraud charges
Author
First Published Nov 9, 2022, 6:04 PM IST

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు వేల కోట్ల రూపాయలను ఎగొట్టి, యూకేలో తలదాచుకుంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ భారత్ కు  తీసుకురావడానికి మార్గం సుగమమైంది. నీరవ్ మోడీని భారతదేశానికి అప్పగించాలనే ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన దాఖాలు చేసిన పిటిషన్‌ను యూకే కోర్టు బుధవారం కొట్టివేసింది. వేల కోట్ల మోసం,మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొనేందుకు అతడిని భారత్‌కు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో నీరవ్ మోదీని భారత్‌ కు తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైంది.

ఈ ఏడాది ప్రారంభంలో నీరవ్ తరపున జస్టిస్ జెరెమీ స్టువర్ట్ స్మిత్,జస్టిస్ రాబర్ట్ జె దాఖలు చేసిన అప్పీల్‌ను యూకే కోర్టు విచారించింది. భారతదేశంలో వేల కోట్ల రూపాయాలను కొల్లగొట్టి యూకేలో దాచుకుంటున్నట్టు కోర్టు గుర్తించింది. ఈ క్రమంలో ఆయనను భారత్ కు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఈ పరిణామంలో భారత ఏజెన్సీ చేసిన కృషి ఎట్టకేలకు ఫలించినట్టయ్యింది. కాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో రూ 13 వేల కోట్ల రూపాయాలను అప్పుగా తీసుకుని.. తిరిగి చెల్లించకుండా.. విదేశాలకు పారిపోయిన కేసులో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడు.  
  
జిల్లా కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్

నీరవ్ మోదీ ప్రస్తుతం ఆగ్నేయ లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నారు. ఫిబ్రవరి 2022లో నీరవ్ మోదీ భారత్‌కు అప్పగించాలని లండన్ జిల్లా కోర్టు ఆదేశించింది. అయితే తీర్పును సవాల్ చేస్తూ.. అక్కడి హైకోర్టును ఆశ్రయించారు.

నీరవ్ మానసిక పరిస్థితిపై ఆరా 

రెండు కారణాలతో అప్పీల్‌ను విచారించేందుకు హైకోర్టు అనుమతించింది. యూరోపియన్ మానవ హక్కుల ఒప్పందం (ECHR)లోని ఆర్టికల్ 3 ప్రకారం.. నీరవ్ మానసిక స్థితి కారణంగా అతనిని అప్పగించడం అసమంజసమైన లేదా అణచివేతకు గురి అయినట్లయితే, మానసిక ఆరోగ్యం గ్రౌండ్ పై ఎక్స్‌ట్రాడిషన్ యాక్ట్ 2003లోని సెక్షన్ 91 కింద అతని పిటిషన్ విచారించడానికి యూకే హైకోర్టు అనుమతించింది. 

నీరవ్ ఏ రెండు కేసుల్లో నిందితుడు?

ప్రస్తుతం మోదీని భారత్ కు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. పంజాబ్ నేషనల్ బాంకులో రూ. 13,500 కోట్ల మేరకు రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా విదేశాలకు పారిపోవడంతో అతనిపై కేసు నమోదైంది. బ్యాంకులకు మోసపూరిత లేఖలు( ఎల్ఓసీ)అందజేయడం. తద్వారా తన కంపెనీలు ప్రయోజనాలు పొందాయనే అభియోగాలు ఉన్నాయి. అలాగే..సాక్షులను బెదిరించడం లేదా మరణానికి కారణమయ్యే నేరపూరిత బెదిరింపు వంటి రెండు అదనపు ఆరోపణలను కూడా ఆయన ఎదుర్కొంటున్నాడు. అతని కేసును  CBI విచారిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios