Asianet News TeluguAsianet News Telugu

అందరికీ కరోనా టీకా.. ధర ఎంతంటే..?

 ఆక్సఫర్డ్ టీకా ధర రూ. 1000 వరకూ ఉండొచ్చంటూ సీరం సీఈఓ ఆధార్ పూనావాలా గతంలో ప్రకటించారు. అయితే.. టీకాల కోసం ప్రభుత్వాలు భారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్న నేపథ్యంలో టీకా ధరలు దిగివచ్చే అవకాశం ఉందని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. 

Serum Institute Likely to Supply Covid-19 Vaccine at Rs 250 Per Dose to Centre: Report
Author
Hyderabad, First Published Dec 8, 2020, 1:42 PM IST

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి వ్యాక్సిన్ కోసం గత సంవత్సరకాలంగా ప్రపంచంలోని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులుపడుతున్నాయి. ఈ విషయంలో సీరం సంస్థ ఓ అడుగు ముందుకేసింది. త్వరలోనే భారత్ లో ని ప్రజలకు ఈ సంస్థ కరోనా టీకాను అందజేయనుంది. ఇప్పటికే దీనికోసం వ్యాక్సిన్ తయారు చేయగా.. త్వరలోనే దీనిని అందరికీ అందజేయనున్నారు. 

దేశ అవసరాలకు సరిపడా టీకా ఉత్పత్తి చేసేందుకు కేంద్రం కూడా సీరం‌ పైనే ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కరోనా టీకాను కేవలం రూ. 250కే అందిస్తామంటూ సీరం ఇన్‌స్టిట్యూట్ కేంద్రానికి ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఆక్సఫర్డ్ టీకా ధర రూ. 1000 వరకూ ఉండొచ్చంటూ సీరం సీఈఓ ఆధార్ పూనావాలా గతంలో ప్రకటించారు. అయితే.. టీకాల కోసం ప్రభుత్వాలు భారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్న నేపథ్యంలో టీకా ధరలు దిగివచ్చే అవకాశం ఉందని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. 

అయితే.. సీరం మాత్రం ఇప్పటివరకూ ఈ వార్తలపై స్పందించలేదు. టీకా పంపిణీ విషయంలో తొలి ప్రాధాన్యం భారత్‌కే అని సీరం గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అత్యవసర వినియోగానికి అనుమతివ్వాలంటూ సీరం ఇటీవలే ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. ఇదిలా ఉంటే.. కరోనా టీకాను ప్రజల కోసం వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు కేంద్రం కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఓవైపు బ్రిటన్ టీకా పంపిణీకి సిద్ధమవుతుండటం..మరోవైపు భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 90 లక్షలు దాటిపోవడంతో కేంద్రం ఈ దిశగా వడవడిగా అడుగులు వేస్తోంది. సీరంతో పాటూ..ఫైజర్ కంపెనీ టీకాల పనితీరు ముదింపు ప్రక్రియను ఇప్పటికే వేగ వంతం చేసిందని సమాచారం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios