Asianet News TeluguAsianet News Telugu

స్పుత్నిక్ వీ ని ఉత్పత్తి చేస్తాం.. అనుమతివ్వండి: కేంద్రానికి సీరం దరఖాస్తు

ర‌ష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌ను భార‌త్‌లో ఉత్ప‌త్తి చేయ‌డానికి డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్ ప్ర‌భావశీల‌త గురించి విశ్లేష‌ణ, ప‌రీక్ష‌లు చేయ‌డానికి కూడా అనుమ‌తులు ఇవ్వాలని సీరం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు స‌మాచారం.
 
serum institute applies to drug authority to manufacture covid vaccine sputnik v ksp
Author
New Delhi, First Published Jun 3, 2021, 2:23 PM IST

ర‌ష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌ను భార‌త్‌లో ఉత్ప‌త్తి చేయ‌డానికి డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్ ప్ర‌భావశీల‌త గురించి విశ్లేష‌ణ, ప‌రీక్ష‌లు చేయ‌డానికి కూడా అనుమ‌తులు ఇవ్వాలని సీరం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు స‌మాచారం.

భార‌త్‌లో స్పుత్నిక్-వీ అత్యవసర వినియోగానికి ఇప్ప‌టికే డీసీజీఐ అనుమ‌తులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగా ర‌ష్యా నుంచి ఇప్ప‌టికే దాదాపు 30 ల‌క్ష‌ల డోసులు భార‌త్‌కు చేరుకున్నాయి. వీటిని హైద‌రాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం రెడ్డీస్ ల్యాబ్స్ ఆధ్వ‌ర్యంలో పంపిణీ చేస్తున్నారు. అలాగే, దేశంలో స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ను రెడ్డీస్ ల్యాబ్ కూడా ఉత్ప‌త్తి చేయ‌నుంది.

Also Read:సీఎంలు బెదిరిస్తున్నారు.. యూకే వదిలి రాను: సీరమ్ అధినేత పూనావాలా వ్యాఖ్యలు

ఇప్పుడు సీరం కూడా ఆ వ్యాక్సిన్‌ను ఉత్ప‌త్తి చేస్తామ‌ని ముందుకు రావ‌డం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్ప‌టికే భార‌త్‌లో సీరం... ఆక్స్‌ఫ‌ర్డ్ టీకా కొవిషీల్డ్‌ను ఉత్ప‌త్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల‌లో 10 కోట్ల డోసులు ఉత్ప‌త్తి చేస్తామని ఈ సంస్థ కేంద్ర ప్ర‌భుత్వానికి తెలిపింది. అంతేకాకుండా అమెరికా కంపెనీ నోవావ్యాక్స్ అభివృద్ధి చేసిన క‌రోనా వ్యాక్సిన్ ఉత్ప‌త్తిని కూడా సీరం ప్రారంభించింది. అయితే దీనికి అమెరికా నుంచి మ‌రికొన్ని అనుమ‌తులు రావాల్సి ఉంది. 
 
Follow Us:
Download App:
  • android
  • ios