సీరియల్ రేపిస్ట్ ను పోలీసులు పట్టుకొన్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలో ఈ ఘటన సోమవారం నాడు చోటు చేసుకొంది.మహిళలపై అత్యాచారాలు చేయడంతో పాటు దోపీడీలు, దొంగతనాల కేసులు నిందితుడిపై ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. సోమవారం నాడు రాత్రి పది గంటల సమయంలో పోలీసులకు నిందితుడికి మధ్య జరిగిన కాల్పుల్లో నిందితుడు గాయాలతో పోలీసులకు చిక్కాడు. సుర్జాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకొంది.

సుర్జాపూర్ పోలిస్ స్టేషన్ పరిధిలో రేప్ ఘటన వెలుగుచూసింది. ఈ కేసును విచారించే సమయంలో నిందితుడికి పలు అత్యాచార కేసులతో సంబంధం ఉన్నట్టుగా తేలిందని పోలీసులు చెప్పారు.2019లో పలువురు మహిళలపై అత్యాచారాలతో పాటు దోపీడీలు, దొంగతనాల కేసుల్లో నిందితుడికి భాగస్వామ్యం ఉందని తేలిందని పోలీసులు తెలిపారు.

నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అతను ఇటీవలనే బెయిల్ పై జైలు నుండి విడుదలయ్యారు.బెయిల్ పై విడుదలైన తర్వాత నిందితుడు అదే రకమైన నేరాలకు పాల్పడ్డాడు. దీంతో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

నిందితుడి స్వగ్రామంతో పాటు పలు ప్రాంతాల్లో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం నాడు గ్రేటర్ నోయిడాలో  నిందితుడి ఆచూకీ లభించింది. లొంగిపోవాలని కోరితే అతను పట్టించుకోలేదు, పోలీసులకు నిందితుడికి మధ్య కాల్పులు చోటు చేసుకొన్నాయి.ఈ కాల్పుల్లో  నిందితుడి కాలికి గాయమైంది. దీంతో అతను పోలీసులకు చిక్కాడు. నిందితుడి వద్ద ఓ తుపాకీని బుల్లెట్లను స్వాధీనం చేసుకొన్నట్టుగా పోలీసులు తెలిపారు.