లక్నో: వరుస హత్యలతో ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్న సీరియల్ కిల్లర్‌ను కుంభమేళా వద్ద అలహాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.గత ఆరు మాసాల్లో పది మందిని హత్య చేసి మరో ఇద్దరిని హత్య చేసేందుకు ప్లాన్ చేసిన కిల్లర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

అలహాబాద్ జిల్లాకు చెందిన ప్రయాగ్ రాజ్ బసెహర గ్రామానికి చెందిన  కలువా అలియాస్ సుభాష్ గత ఏడాది జూలై నుండి హత్యలకు పాల్పడుతున్నాడు. కిడీగంజ్, పరేడ్ గ్రౌండ్, కుంభమేళా ప్రాంతాల్లో హత్యలు చేశారు. పుట్‌ఫాత్‌పై నిద్రించే కూలీలను లక్ష్యంగా చేసుకొని హత్యలకు పాల్పడ్డాడు.

శుక్రవారం కుంభమేళా పరిసర ప్రాంతాల్లో నిద్రపోతున్న ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి చేసి పారిపోయాడు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అక్కడి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 

గత ఆరు నెలలుగా సుభాష్‌ పది మందిని హత్య చేశాడు. మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచాడు. బాధితుల దుస్తులతోనే వారి ముఖాన్ని కప్పి ఊపిరాడకుండా చేసేవాడని పోలీసులు తెలిపారు.