అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సెంథిల్ బాలాజీని మంత్రి పదవి నుంచి తొలగించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ . గవర్నర్ ఆదేశాలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి బాలాజీని మంత్రి పదవి నుంచి తొలగించారు . గవర్నర్ రవి ఆదేశాలతో బాలాజీని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు స్టాలిన్. 

అసలు సెంథిల్ బాలాజీపై వచ్చిన అభియోగాలేంటి?

2011 నుంచి 2015 వరకు అన్నాడీఎంకే ప్రభుత్వంలో బాలాజీ రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జాబ్ రాకెట్ కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మొత్తం రూ.1.60 కోట్ల లెక్కల్లో చూపని నగదును బాలాజీ, ఆయన భార్య బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ డబ్బు అతడి నిజమైన ఆదాయం నుండి వచ్చిందని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలూ లేవని ఈడీ తెలిపింది. ప్రస్తుతం ద్రవిడ మున్నేట్ర కళగం (డిఎంకె) నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వంలో విద్యుత్, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖకు బాలాజీ నేతృత్వం వహిస్తున్నారు.